మీకు షుగర్ ఉందా అయితే రాత్రి పూట పాలలో వీటిని కలుపుకుని తాగండి
Health News భారత్ ప్రతినిధి : డయాబెటిక్ ఇది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య. మన దేశంలో దాదాపు18యేళ్లకు పైబడిన77మిలియన్ల మందికి టైప్ 2 డయాబెటిక్ ఉంది. అదనంగా 25 మిలియన్ల మంది ప్రీ డయాబెటిక్ గా గుర్తించారు. అంటే వీరికి త్వరలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉందన్నమాట. డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉంటే ఆటోమేటిక్ గా బ్లడ్ షెగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.
మనం తీసుకునే ఆహారం, జీవన శైలి వల్ల కూడా డయాబెటిక్ బారిన పడే అవకాశం ఉంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే హైపర్ గ్లైసీమియా అంటారు. మరి షుగర్ ను కంట్రోలో చేయడమెలా? పాలల్లో కొన్ని రకాల స్పైసిస్ కలుపుకొని తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటెన్ చేయొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో చూద్దాం.
దాల్చిన చెక్కతో షుగర్ కంట్రోల్..
వంటింట్లో ఉండే ఇంగ్రీడియెంట్ దాల్చిన చెక్క(Cinnamon) ఒకటి. దాల్చిన చెక్క తినడం ద్వారా బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికోసం ఒక గ్లాసు పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకొని నిద్రపోయే ముందు తాగితే బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయొచ్చు. మన ఆహారంలో భాగంగా కూడా దాల్చిన చెక్కను తింటే డయాబెటిక్ పేషెంట్స్ చాలా మేలు చేస్తుంది.
ఏవిధంగా పనిచేస్తుందంటే..
నేషనల్ లిబరరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించబడిన రిపోర్టు ప్రకారం..అధిక బ్లడ్ షుగర్( హైపర్ గ్లైసీమియా)ను కూడా కంట్రోల్ చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది మంచి ప్రయోజనాలను అందిస్తుందని నిరూపించబడింది. ప్రత్యేకించి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వచ్చే బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడంలో ఇది ప్రముఖంగా పనిచేస్తుంది. కొంతమంది డయాబెటిక్ పేషెంట్లకు 1 గ్రాము దాల్చిన చెక్కను మూడు నెలల పాటు ఇవ్వడం ద్వారా వారిలో పాస్టింగ్ షుగర్ లెవెల్స్ ను 17 శాతం తగ్గినట్టు తేలింది.
దాల్చిన చెక్క లాభాలు....
ఒక్క షుగర్ లెవెల్సే కాదు దాల్చిన చెక్కతో అనేక వ్యాధులను నయం చేసే గుణాలున్నాయని నిరూపించబడింది. దాల్చిన చెక్క తింటే ఒబేసిటీ తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో ఇది బాగా పనిచేస్తుంది. ఓ గ్లాసు నీళ్లలో దాల్చిన చెక్క ముక్క వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం లేవగానే ఆ నీళ్లను తాగడం ద్వారా అధిక కొలెస్టరాల్ను తగ్గిస్తుంది. ఇది బాడీ మెటబాలిజాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
Diabetic is a health problem that is bothering many people now. About 77 million people above 18 years of age in our country have type 2 diabetes. An additional 25 million people are diagnosed as prediabetic. It means that they are at risk of getting diabetes soon. Diabetic patients are on an empty stomach most of the time
The food and lifestyle we eat can also lead to diabetes. High blood sugar levels are called hyperglycemia. How about controlling sugar? Let's see if the health experts say that blood sugar levels can be maintained if some spices are added to the milk.