బషీరాబాద్ మండల కేంద్రంలో సిపిఎం జిల్లా మూడవ మహాసభల కర్రపత్రం విడుదల
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : మంగళవరం రోజు బషీరాబాద్ మండల కేంద్రంలో సిపిఎం జిల్లా మహాసభల కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా మూడవ మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ అక్టోబర్ 8,9 తేదీలలో తాండూరు పట్టణంలో సిపిఎం జిల్లా మూడవ మహాసభలు నిర్వహించబోతున్నాం. మొదటి రోజు ర్యాలీ, రెండవ రోజు ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నము. ఈ మహాసభలలో వికారాబాద్ జిల్లాలో ఉన్న పేదల కోసం కార్మికుల కోసం రైతుల కోసం జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వ భూముల రక్షణ కోసం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డబుల్ బెడ్ రూమ్ వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మాహసభలలో వికారాబాద్ జిల్లా ప్రజల అభివృద్ధిఫై ప్రభుత్వము అవలంబిస్తున్న విధానాలఫై మరియు తాండూర్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాండూరులో అనేక సంవత్సరాలుగా కాలుష్యం నుంచి తాండూర్ పట్టణ ప్రజలు అనేక ఇబ్బందుల గురవుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. తాండూర్ నియోజకవర్గం కంది పంటకు ప్రసిద్ధి గాంచింది కానీ కంది బోర్డు మరియు మిగతా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో డిమాండ్ చేయడం జరిగింది.
సిపిఎం పార్టీ అభివృద్ధికి ఆటంకం కాదు. అభివృద్ధికి నిరంతరం సిపిఎం పార్టీ భాగస్వామ్యం అవుతుందని అన్నరు.కానీ అదే సందర్భంలో అభివృద్ధి పేరుతో పేదల,సన్న,చిన్న కారు రైతుల భూములలో లాక్కుంటే ఊరుకునేది లేదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పేరుతో అనేక వేల ఎకరాల భూమి ప్రభుత్వం పేదల భూమిని సేకరించడం దుర్మార్గం అన్నారు.రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ఇంటి స్థలం లేని పేదలందరికీ ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభలలో చర్చించి భవిష్యత్తులో ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వలపై పై సమరశీల పోరాటాలను నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. అందుకని రెండు రోజులు జరగబోయే సిపిఎం జిల్లా మహాసభలకు తాండూర్ నియోజకవర్గ ప్రజలందరూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని సిపిఎం ప్రజాసంఘాల నాయకులు అధ్యక్షులు సురేష్ వెంకటేష్ ఎమ్మార్పీఎస్ నాయకులు కృష్ణ సిఐటియు నాయకులు చందు శ్యామ్ మరియు తదితరులు పాల్గొన్నారు.