అక్టోబర్ నెలాఖరులో ఇందిరమ్మ ఇళ్లు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ నెలాఖరులోగా ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3500 ఇళ్ల నుంచి 4 వేల ఇళ్ల వరకు ఇస్తామన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పింకు చొక్కాలు, మూడు రంగుల జెండాతో సంబంధం లేకుండా పేదలకు ఇళ్లు కేటాయిస్తామన్నారు.
దశాబ్దాల కొద్ది మూసీలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు పొంగులేటి. మూసీ బెడ్ లో నివసించే వారికి మంచి జీవితం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. దీన్ని కూడా ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నారని తెలిపారు. గత పదేళ్ళలో వాళ్ళు చేయలేని పనులు తాము చేస్తుంటే బీఆర్ఎస్ చిల్లర వేషాలు వేస్తుందని విమర్శించారు.పెయిడ్ ఆర్టిస్తులను తీసుకొచ్చి యూట్యూబ్ ల ద్వారా
దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు పొంగులేటి మూసీలో ఉన్నవారికి అన్ని వసతులతో ఇళ్లు, జీవనోపాధి కల్పిస్తున్నామని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మూసీలో ఉండే పిల్లలను వారికి నచ్చిన స్కూల్స్ లో అడ్మిషన్ ఇప్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాను తెచ్చుకోవడంలో విఫలమైందన్నారు పొంగులేటి.
Minister Ponguleti Srinivas Reddy made a key statement on Indiramma Houses. By the end of October, 3500 houses to 4 thousand houses will be given as the first installment to each constituency. A program was held to distribute double bedroom pattas to the beneficiaries of Goshamahal constituency. Speaking on the occasion, Ponguleti said that the government's target is to provide 20 lakh Indiramma houses in the next four years. Houses will be allotted to the poor regardless of the pink shirts and the tricolor flag.
Ponguleti said that people are facing difficulties in few decades. He said that this government is thinking to give a better life to those who live in Moosi bed. He said that the opposition is distorting this too. Ponguleti criticized that if they are doing things that they could not do in the last ten years BRS is pretending to be a retailer.
Ponguleti Srinivas Reddy said that we are providing houses and livelihood to those in Musi with all the facilities. They said that the children who stay in Musi are given admission in the schools of their choice. Ponguleti said that the previous government failed to get the share from the central government.