ఖమ్మం జిల్లాలో మెడికల్ కాలేజీలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇతర పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హత గలవారు అక్టోబర్ 19 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రాజేశ్వర్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియో డయాగ్నసిస్, ఫార్మకాలజి, కమ్యూనిటీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, రెస్పిరేటరీ మెడిసిన్) పోస్టులు, ఐసీయూ సేవలు అందించే 5 సీఏఎస్ స్పెషలిస్ట్ (అనేస్థిషియా, 2 జనరల్ మెడిసిన్, 2 పల్మనరీ మెడిసిన్) పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. ఆన్ లైన్,ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అక్టోబర్ 21న ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల్లో నియమిస్తామని తెలిపారు.
Eligible candidates should apply before October 19 for the vacancies of assistant professor and other posts in government medical college in Khammam district, Principal Rajeshwar Rao said in a statement on Monday.
Five Assistant Professor (Radio Diagnosis, Pharmacology, Community Medicine, Emergency Medicine, Respiratory Medicine) posts and 5 CAS Specialist (Anaesthesia, 2 General Medicine, 2 Pulmonary Medicine) posts providing ICU services are being filled on contractual basis. He said that they should apply online and offline and they will be appointed to the posts through an interview on October 21.