వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డు చెల్లదా సుప్రీంకోర్టు ఏం చెబుతుందంటే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఆధార్ కార్డు వ్యక్తి గుర్తింపు కార్డుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎడ్యుకేషన్, బ్యాంక్ అకౌంట్లు ఒకరకంగా చెప్పాలంటే అన్నింటికీ ఆధార్ కార్డే కీలకం అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఆధార్ కార్డుపై కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన వ్యక్తికి సంబంధించిన కేసులో తీర్పును వెలువరిస్తూ ఆధార్ కార్డు చెల్లుబాటుపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆధార్ కార్డు పుట్టిన తేదీకి అధికారికి ప్రూఫ్ కాదని చెప్పింది. స్కూల్ రికార్డుల్లో ఉండే పుట్టినరోజు తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధితుడికి పరిహారం మంజూరు చేసే కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఈ కేసులో ఆధార్ కార్డు ఆధారంగా వయసు నిర్దారణ చేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
2015లో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి బంధువులు దాఖలు చేసిన అప్పీల్ పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ కేసులో విచారణ జరిపిన పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తులు పరిహారాన్ని తగ్గించి ఆధార్ కార్డు ఆధారంగా వయస్సును నిర్ధారించి పరిహారం లెక్కించింది. దీంతో బాధితులు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆధార్ కార్డులోని వయసును ఆధారంగా చేసుకొని తమకు వచ్చే పరిహారాన్ని హైకోర్టు తగ్గించిందని వాపోయారు. స్కూల్ రికార్డుల ఆధారంగా తన వయసు 45ఏళ్లేనని బాధితుడు కోర్టుకు తెలుపగా..మోటార్ యాక్సిడెంట్ ట్రెబ్యునల్ తీర్పును సమర్థిస్తూ పుట్టిన తేదీని నిర్ధారించేందుకు ఆధార్ కార్డు అధికారిక ప్రూఫ్ కాదని స్కూల్ రికార్డుల్లో ఉండే పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని తీర్పునిచ్చింది.