Type Here to Get Search Results !

Sports Ad

ఆపరేషన్ అంటే అంత నిర్లక్ష్యమా పన్నెండేళ్లుగా మహిళ కడుపులో కత్తెర Is The Operation So Careless Scissors In The Woman's Stomach For Twelve Years

ఆపరేషన్ అంటే అంత నిర్లక్ష్యమా పన్నెండేళ్లుగా మహిళ కడుపులో కత్తెర

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఓ మహిళ కడుపులో గత 12ఏళ్లుగా కత్తెర ఉంది. దాదాపు ఆమె పది సంవత్సరాలుగా పొత్తి కడుపు నొప్పితో బాధపడుతునే ఉంది. 12 సంవత్సరాలుగా డాక్టర్లు ఆమె కడుపులో కత్తెర ఉందన్న విషయం కనిపెట్టలేకపోయారు. సిక్కింలోని 45ఏళ్ల మహిళ అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంటే చేదు అనుభవం ఎదరైంది. తీవ్ర కడుపు నొప్పితో బాధపడిన ఆమె 2012లో  గాంగ్‌టక్‌లోని సర్ థుటోబ్ నామ్‌గ్యాల్ మెమోరియల్ (STNM) హాస్పిటల్‌లో అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. శస్త్ర చికిత్స సమయంలో డాక్టర్లు ఓ కత్తెరను పేషెంట్ కడుపులోనే పెట్టి మర్చిపోయారు.

 అప్పటి నుంచి ఆమె కడుపులో 12 సంవత్సరాలుగా కత్తెర అలాగే ఉండిపోయింది. పలుమార్లు కడుపునొప్పితో బాధపడిన ఆమె హాస్పిటల్ కు వెళ్లినా డాక్టర్లు పేషెంట్ కడుపులో కత్తెర ఉందన్న విషయం గుర్తించలేకపోయారు.  2024 అక్టోబర్ 8న ఆమె మళ్లీ STNM ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్లు ఎక్స్-రే తీయగా.. ఆమె కడుపులో ఆపరేషన్ చేసే కత్తెర ఉన్నట్లు తేలింది. వెంటనే మళ్లీ ఆమెకు ఆపరేషన్ చేసి కత్తెరను బయటకు తీశారు. విషయం బయటకు పొక్కడంతో ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

A woman has had scissors in her stomach for the past 12 years. She has been suffering from abdominal pain for almost ten years. For 12 years doctors could not find the scissors in her stomach. 

 A 45-year-old woman in Sikkim had a bitter experience when she underwent an appendix operation. Suffering from severe abdominal pain, she underwent an appendix operation at Sir Thutob Namgyal Memorial (STNM) Hospital in Gangtok in 2012. During the surgery, the doctors forgot to put a pair of scissors in the patient's stomach. Since then, the scissors remained in her stomach for 12 years. She went to the hospital suffering from stomach pain several times, but the doctors could not identify the fact that there was a scissors in the patient's stomach.  

 On 8th October 2024 she again went to STNM hospital. When the doctors took an X-ray, it was found that there were surgical scissors in her stomach. Immediately she was operated again and the scissors were taken out. When the matter came out, the state's medical and health department expressed its anger on the hospital staff.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies