Type Here to Get Search Results !

Sports Ad

ఇంజనీరింగ్, ITI చేసినోళ్లకు గుడ్ న్యూస్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు Good News For Engineering And ITI Candidates Are Apprentice Posts In Railways

ఇంజనీరింగ్, ITI చేసినోళ్లకు గుడ్ న్యూస్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇండియన్ రైల్వేలో ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి భారతీయ రైల్వే శాఖ మంచి అవకాశాన్ని కల్పించింది. కొంకన్ రైల్వే, పాటియాల లోకోమోటివ్ వర్క్‪లో ట్రైనీ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పాటియాల లోకోమోటివ్ వర్క్ యాక్ట్ రిక్రూర్మెంట్ (PLW)లో 250, కొంకన్ రైల్వేస్ లో 190 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 

పాటియాలా లోకోమోటివ్ వర్క్స్ రిక్రూర్మెంట్ 250 పోస్టుల వివరాలు....
* అక్టోబర్ 7 నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్ స్వీకరిస్తున్నారు.
* ఎలక్ట్రిషియన్ 130, డీజిల్ మెకానికల్ 30, మెషినిస్ట్ 20, ఫిట్టర్ 40, వెల్డర్ 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
* టెన్త్ తోపాటు ఐటిఐ చేసిన వారు అర్హులు
* plw.indianrailways.gov.in అఫీషియల్ వెబ్ సైట్ లో అప్లై చేసుకోవచ్చు.
* 15 నుంచి 24 ఏళ్ల ఏజ్ లిమిట్ ఉంది. వెల్డర్ పోస్టుకు మాత్రం గరిష్ట వయోపరిమితి 22ఏళ్లు. 
* జనరల్ క్యాటగిరి అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.

కొంకన్ రైల్వేస్ అప్రెంటిస్ 190 పోస్టులు....
* ఇందులో 190 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు.  
* దరఖాస్తు చివరి తేదీ 2024 నవంబర్ 2. 
* nats.education.gov లో  ఆన్ లైన్ విదానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 25 ఏళ్లు. 
* జనరల్ క్యాటగిరి అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.
* అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies