Type Here to Get Search Results !

Sports Ad

ఐఐటీ కోర్సుల్లో చేరాలా జేఈఈ అవసరం లేదు JEE Is Not Required For Admission In IIT Courses

ఐఐటీ కోర్సుల్లో చేరాలా జేఈఈ అవసరం లేదు

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఐఐటీ కోర్సుల్లో చేరాలన్నది చాలామంది పిల్లల లక్ష్యం అయితే, ఐఐటీ కోర్సుల్లో చేరాలంటే ముందుగా జెఈఈలో క్వాలిఫై అవ్వాలన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ఐఐటీ షార్ట్ టర్మ్ కోర్సుల్లో చేరాలంటే జెఈఈలో అర్హత సాధించాల్సిన అవసరం లేదు. అవి ఏ కోర్సులు వాటిలో ఎలా చేరాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఐటీ దిల్లీ యూఐ, యూఎక్స్ డిజైన్ సర్టిఫికేషన్ : UI / UX డిజైనింగ్ సర్టిఫికేషన్ కోసం ఆరు నెలల షార్ట్ టర్మ్ కోర్సును అందిస్తోంది ఐఐటీ ఢిల్లీ. ఈ కోర్స్ ద్వారా UI / UX డిజైనింగ్ పట్ల పూర్తి అవగాహన పొందవచ్చు. ఏదైనా డిగ్రీ చదివి.. కనీసం 1 సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు. ఈ సర్టిఫికేషన్ పొందాలంటే 50 శాతం అటెండెన్స్.. 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. సర్టిఫికేషన్ కి క్వాలిఫై అవ్వనివారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందిస్తుంది ఐఐటీ ఢిల్లీ. 

ఐఐటీ కాన్పూర్ సర్టిఫికెట్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవాప్స్ : క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్ కోర్సుల్లో సర్టిఫికేషన్ కోసం ఎనిమిది నెలల షార్ట్ టర్మ్ కోర్సును అందిస్తోంది ఐఐటీ కాన్పూర్. ఈ కోర్సును ఈ అండ్ ఐసీటీ అకాడమితో కలిసి అందిస్తోంది. ఇందులో క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్ గురించి పూర్తిస్థాయి శిక్షణ ఇస్తారు. 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయినవారు ఈ కోర్సుకు అర్హులు. ఈ షార్ట్ టర్మ్ కోర్సులో వివిధ స్థాయుల్లో 30 విభిన్న ప్రాజెక్టులు ఉంటాయి.  ప్రోగ్రామింగ్ చదువుకోని విద్యార్థులు సైతం నేర్చుకునేలా ఈ కోర్స్ ను డిజైన్ చేశారు.

ఐఐటీ మద్రాస్ బీఎస్సీ ఇన్ డేటాసైన్స్ : 10th క్లాస్ మ్యాథ్స్ బాగా వచ్చి ఉండి.. ఇంటర్ పాస్ అయితే చాలు ఐఐటీ మద్రాస్ వారు అందించే బీఎస్సీ ఇన్ డేటా సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ కోర్సులో జాయిన్ అయిన నెలరోజుల తర్వాత మరో అసెస్మెంట్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ కోర్స్ లో మూడు ఫేజ్ లు ఉంటాయి  ఫౌండేషనల్, డిప్లొమా, డిగ్రీ ఇలా ఏ ఫేజ్ లో అయినా స్టూడెంట్స్ ఇంట్రస్ట్ ని బట్టి బయటకు రావొచ్చు.

ఐఐటీ రూర్కీ : సర్టిఫికెట్ ఇన్ జెనరేటివ్ ఏఐ ఖీ మెషిన్ లెర్నింగ్ 
'ఐహబ్ దివ్య సంపర్క్' సంస్థతో కలిసి సర్టిఫికెట్ ఇన్ జెనరేటివ్ ఏఐ ఖీ మెషిన్ లెర్నింగ్ అనే 11 నెలల సర్టిఫికెట్ కోర్సును అందిస్తోంది ఐఐటీ రూర్కీ. ఈ కోర్స్ లో ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ పై శిక్షణ అందిస్తారు. వర్చువల్ క్లాసెస్, ప్రాజెక్టులు, రెండు రోజుల క్యాంపస్ విజిట్ వంటి ఫేజ్ లు ఈ కోర్స్ లో ఉంటాయి.

ఐఐటీ కాన్పూర్ : ఏఐ అండ్ మెషిన్ లర్నింగ్ విత్ పైతాన్నాలుగు వారాల ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్స్ లో ఏఐ ఎంఎల్, పైతాన్ ప్రోగ్రామింగ్ శిక్షణ అందిస్తారు. టెన్సర్ ప్లో, పాండాస్ వంటి రియల్ టైంలో ఉపయోగించే టూల్స్ మీద అవగాహన అందిస్తారు. స్టూడెంట్స్, ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసేవారు.. అన్న తేడా లేకుండా ఎవరైనా ఈ కోర్సులో చేరవచ్చు.ఎలాంటి అనుభవం లేనివారు కూడా ఈ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు.

If the goal of many children is to join IIT courses, it is known that before joining IIT courses, they have to qualify in JEE. But there is no need to qualify in JEE to get admission in some IIT short term courses. Now let's know the complete details like which courses and how to join them.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies