పొగాకు రహిత యువతను మార్చుదాం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : విష్ణువర్ధన్ రెడ్డి పొగాకు జిల్లా నియంత్రణ విభాగము సూపర్వైజర్ సంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు పొగాకు నియంత్రణపై ర్యాలీ నిర్వహించారు మరియు , సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించినారు బస్టాండ్ పరిసర ప్రాంతాలు నందు. మార్కెట్ నందు పొగాకు వాడకం ద్వారా కలిగే దుష్పర్ నామాలు గురించి అవగాహన కల్పించినరు. పలు విద్యాసంస్థలు సందర్శించి విద్యార్థి విద్యార్థులకు ఈరోజు పలు ఆరోగ్య అంశాలపై వివరించినారు.
విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు ముఖ్యంగా యువత మరి పొగాకు వాడకలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం 60 రోజు లు టౌబోకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 2.0 ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా యువతకు పొగాకు వాడకం దూరంగా ఉంచడం. పొగాకు రహిత గ్రామాలకు తీర్చిదిద్దడం పొగాకు రహిత విద్య సంస్థలు తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. నేటి యువత పొగాకువస్తువులైన బీడీ సిగరెట్ జరదా గుట్కా పాన్ మసాలాలు సేవించి చిన్న వయసులోనే వివిధ రకాల క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు వ్యాధుల బారిన పడుతున్నారు.
బహిరంగ ప్రదేశంలో పొగాకు తాగినప్పుడు వారి పిలిచిన పొగను ఇతను పీల్చడం ద్వారా ఇతరులు వ్యాధుల బారిన పడుతున్నారు ముఖ్యంగా గమనించలి మానవ శరీరం నికోటిన్ అలవాటు పడి తర్వాత వ్యసనం గురై జీవితంలో ఎన్నో ఇబ్బందులు గురై అకాల మరణం సంభవిస్తున్నాయి ఆరోగ్యశాఖ వారు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా టెలిమానస్ 14416 ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నాము అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ సి డి క్లీనింగ్ నందు. బిపి, షుగర్, క్యాన్సర్ సంబంధించిన ప్రాథమిక పరీక్ష నిర్వహించి వాళ్లకు సల లుసూచనలు ఇవ్వడం జరుగుతుంది.
ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి వివిధ సమస్యలతో ఒత్తిడికి లోనవుతున్నారు తర్వాత వివిధ వ్యసనాలకు గురై బానిసై కుటుంబాన్ని మరియు తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు తన ఆరోగ్యం తన చేతిలోనే ఉన్న విషయాన్ని మర్చిపోయి వివిధ అలవాటు ద్వారా అనారోగ్య గురి కవద్దన్నారు ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరారు పొగాకు ఉత్పత్తులను బహిరంగ ప్రదేశంలో సేవించినచో జరిమానా విధిస్తామని హెచ్చరించినారు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి పొగాకు రహిత గ్రామాలకు తీర్చిదిద్దడం లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో శానిటైజర్ సిబ్బంది ,సెక్యూరిటీ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.