టెక్నాలజీ వాట్సాప్‌లో లో లైట్ మోడ్
జాతీయ National News భారత్ ప్రతినిధి : స్మార్ట్ ఫోన్లో వీడియో కాల్ ఫెసిలిటీ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ ఈ ఫీచర్‌ని వాట్సాప్ తీసుకొచ్చిన తర్వాతే వాడకం పెరిగింది. అయితే.. హై క్వాలిటీ కెమెరాలు ఉండే ఫోన్లతో వీడియో కాల్ మాట్లాడితే.. లైటింగ్ తక్కువగా ఉన్నా బాగానే కనిపిస్తుంది. కానీ క్వాలిటీ కెమెరాలు లేని బడ్జెట్ ఫోన్లతోనే కాస్త ఇబ్బంది. అందుకే ‘లో లైట్’లో కూడా వీడియో క్వాలిటీని కాస్త పెంచేందుకు వాట్సాప్‌లో లైట్ మోడ్ పేరుతో ఒక ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఫీచర్‌తో తక్కువ వెలుతురులో కూడా క్వాలిటీ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ముఖాలు బ్రైట్‌గా కనిపిస్తాయి. వాట్సాప్ వీడియో కాల్ చేసి, స్క్రీన్‌పై కనిపించే సెట్టింగ్స్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే ‘లో లైట్ మోడ్’ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే చాలు పిక్చర్ క్లియర్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.