రైలు వెళుతుండగా విరిగిపోయిన లింక్ రాడ్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తమిళనాడులో ప్రయాణికులతో వెళుతున్న రైలు పెద్ద గండం నుంచి త్రుటిలో తప్పించుకుంది. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలో వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు పెను ప్రమాదం తప్పింది. కాట్పాడి రైల్వేస్టేషన్ సమీపంలో ఇంజన్కు, బోగీలకు మధ్య ఉండే లింక్ తెగింది. లోకో పైలట్ వెంటనే అప్రమత్తం కావడంతో లింక్ రాడ్ విరిగిపోయినప్పటికీ అదృష్టవశాత్తూ బోగీలు పట్టాల పైనే నిలిచిపోయాయి. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ముకుందరాయపురం, తిరువాళం రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనపై అధికారులకు సమాచారం ఇవ్వడంతో 20 మంది సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ రైలు నిలిచిపోవడంతో చెన్నై, బెంగుళూరు మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రూట్లో రాకపోకలు సాగించాల్సిన రైళ్లను ఎక్కడికక్కడ స్టేషన్లలోనే నిలిపివేశారు.
A train carrying passengers in Tamil Nadu has narrowly escaped from Pida Gandam. The Vivek Express train met with a major accident near Katpadi in Vellore district. The link between the engine and the bogies was broken near Katpadi railway station. The loco pilot was immediately alerted and fortunately the bogies remained on the tracks despite the broken link rod. A big accident was averted. The incident took place between Mukundarayapuram and Thiruvalam railway stations.
After informing the authorities about this incident, 20 personnel rushed to the spot. The incident took place around 9:30 am on Friday. Due to the stoppage of this train, there was a severe disruption in the train traffic between Chennai and Bangalore. Trains to travel on this route were stopped at various stations.