తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక హైదరాబాద్ పబ్లిక్ జర జాగ్రత్త
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, నవంబర్ 1 వరకూ చిన్నపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు లా నీనా కారణంగా హైదరాబాద్లో ప్రతీ సంవత్సరం కంటే ఈ సంవత్సరం చలి విపరీతంగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.
అక్టోబర్, నవంబర్ మధ్య వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు లా నీనాకు కారణమయ్యాయని.. ఈ కారణంగా హైదరాబాద్లో ఈసారి చలి తీవ్రత ముునుపెన్నడూ లేనంతగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది కూడా శీతా కాలంలో హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోయాయి. ఒకానొక సమయంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పరిమితమయిన సందర్భాలు కూడా ఉన్నాయి.