Type Here to Get Search Results !

Sports Ad

పారామెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌‌‌‌కు నోటిఫికేషన్ విడుదల Notification Released For Paramedical Seats Counselling

పారామెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌‌‌‌కు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రభుత్వ, ప్రైవేటు పారామెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి పారామెడికల్ బోర్డు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30లోపు పూర్తి వివరాలతో దరఖాస్తులను సంబంధిత జిల్లా డీఎంహెచ్‌‌‌‌వో ఆఫీసులో అందజేయాలని అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా నవంబర్ 11లోపు కౌన్సెలింగ్ పూర్తి చేసి, అదే నెల 20వ తేదీలోపు సెలక్షన్ లిస్టును విడుదల చేస్తామన్నారు. 25వ తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయని వెల్లడించారు. పారామెడికల్ కోర్సులకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

 అయితే, సీట్ల కేటాయింపులో బైపీసీ చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ బైపీసీ చదివిన విద్యార్థులు లేకపోతే, ఎంపీసీ చదివిన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు లేకపోతే, మిగిలిన కోర్సులు చదివిన విద్యార్థులకు సీట్లను అలాట్ చేస్తారు. దరఖాస్తు ఫారాలను వెబ్‌‌‌‌సైట్ https://tgpmb.telangana.gov.in/ నుంచి డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

 జిల్లాలు, కాలేజీలు, కోర్సుల వారీగా సీట్ల వివరాలను సైట్‌‌‌‌లో పొందుపరిచారు. మరోవైపు, రాష్ట్రంలో 206 ప్రైవేటు పారామెడికల్ కాలేజీలు ఉండగా, 40 ప్రభుత్వ పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 28 కాలేజీలు ఈ ఏడాదే నుంచే అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో కాలేజీలో రెండు కోర్సులను ప్రారంభించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఈ కాలేజీలను ఏర్పాటు చేశారు. ప్రతి కోర్సుకు 30 సీట్లు కేటాయించారు. దీంతో మొత్తం 28 కాలేజీల్లో కలిపి 1,680 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో కలిపి ప్రభుత్వ పారామెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 3,122కు పెరిగింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies