ఈ చిన్నారి ని ఆదుకోండి చేతులెత్తి వేడుకుంటున్న తల్లిదండ్రులు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వరంగల్ జిల్లా,కాజీపేట పట్టణం బాపూజీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న తోకల సర్వేశ్ - ప్రేమలత దంపతుల కూతురు చిన్నారి యశ్వతకు పుట్టినప్పటి నుండి మానసిక స్థితి సరిగా లేదు.దీంతో ఆ చిన్నారిని ఎందరో డాక్టర్లకు చూపించారు.అయినప్పటికీ ఎలాంటి ఫలితము లేకుండా పోయింది.ఇప్పటికే తల్లిదండ్రులు అప్పులు చేసి చిన్నారి వైద్యానికి రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేశారు. అయినా ఆ చిన్నారి నడవలేకపోవడం,మాట్లాడలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతోంది.
ఆ తల్లిదండ్రులకు వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో వారు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కూలీ పనులు చేస్తే తప్ప పూటగడవని ఆ దంపతులు కార్పొరేట్ దవాఖానలో వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో తల్లడిల్లిపోతున్నారు. ఈ చిన్నారి పట్ల ప్రభుత్వం స్పందించి కార్పొరేట్ వైద్యం అందించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఇంకా ఎవరైనా దాతలు సహకరించి తమను ఆదుకోవాలని వారు రెండు చేతులెత్తి వేడుకుంటున్నారు. వింత సమస్యతో బాధ పడుతున్న తమ కూతురుకి ఆపన్నహస్తం అందించి సాయపడాలని కోరుకుంటున్నారు.
తమ చిన్నారికి ఎవరైనా కార్పొరేట్ వైద్యం చేయించి ఆదుకుంటే వారిని జీవితాంతం గుర్తుంచుకుంటామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ మానవత్వం చాటుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. ఎవరైనా ఆర్థికంగా సాయం చేయాలనుకున్న దాతలు కల్వల ప్రేమలత బ్యాంక్ అకౌంట్ ( యూనియన్ బ్యాంక్, కాజీపేట బ్రాంచ్... అకౌంట్ నంబర్ 122710100091805, IFSC CODE: UBIN0802999)లో ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నారు, తండ్రి సర్వేశ్ ఫోన్ నంబర్ 6300812559లో సంప్రదించాలని వేడుకుంటున్నారు.