తల్లిదండ్రులూ జాగ్రత్త బోర్బన్ బిస్కెట్‌లో ఐరన్ వైర్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పిల్లలు బిస్కెట్లు అడగ్గానే కొనిచ్చేస్తున్న తల్లిదండ్రులందరికీ హెచ్చరిక లాంటిది ఈ కథనం. పిల్లలు మొదలు పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్‌లో ఐరన్ వైర్ దర్శమిచ్చింది. తినే ముందు సదరు పిల్లాడు దానిని( ఇనుప తీగ) గమనించడంతో పెద్ద అపాయం తప్పింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
కామారెడ్డి జిల్లా, దేవునిపల్లికి చెందిన హనుమంతరెడ్డి అనే వ్యక్తి తన పిల్లలకు స్థానిక దుకాణంలో బోర్బన్ బిస్కెట్ ప్యాక్ కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి పిల్లలు ప్యాక్ ఓపెన్ చేసి బిస్కెట్లు తింటుండగా సన్నని ఇనుప తీగ కనిపించింది. దాన్ని వారు తండ్రికి చూపెట్టడంతో అతను ఆ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు చిరుతిళ్లు తినిపించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే వారి ప్రాణానికే ముప్పు తేవచ్చని అతను వీడియోలో హెచ్చరించాడు. తల్లిదండ్రులను అప్రమత్తం చేయడానికి వీడియో పోస్ట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
This article is like a warning to all the parents who give biscuits when their children ask for them. Iron wire has appeared in the biscuit which is loved by children and adults alike. A big danger was averted when the child noticed it (the iron wire) before eating it. This incident came to light in Kamareddy district of Telangana.
Hanumantha Reddy, a resident of Godupalli, Kamareddy district, bought a pack of bourbon biscuits for his children from a local shop. When the children went home and opened the pack and were eating biscuits, they saw a thin iron wire. They showed it to the father and he recorded the scenes
In the video, he warned parents to be vigilant while feeding snacks to their children or risk their lives. He said that the video is being posted to alert parents.