డీఎస్సీ టీచర్ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. పలు సాంకేతిక కారణాల వల్ల కౌన్సిలింగ్ వాయిదా వేసినట్లు తెలిపింది విద్యా శాఖ. పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఇటీవల సీఎం రేవంత్ చేతుల మీదుగా 10,006 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకున్నారు . డీఎస్సీ2024 నియామక పత్రాలు అందుకున్న వారికి అక్టోబర్ 15న పోస్టిగ్ ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
డీఈవోలు సూచించిన ఆఫీసుల్లో కౌన్సిలింగ్ కు హాజరుకావాలని ఆదేశించారు. అభ్యర్థులు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు అపాయింట మెంట్ లెటర్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ జరుగుతుందని చెప్పారు. దీంతో అభ్యర్థులు ఇవాళ ఉదయం నుంచి ఆఫీసుల ముందు క్యూ లైన్లో ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా డీఎస్సీ కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
DSC Teacher Posting Counseling has been postponed across Telangana. The education department said that the counseling has been postponed due to various technical reasons. It has been revealed that the posting counseling dates will be announced soon. Recently, 10,006 candidates received the appointment papers from the hands of CM Revanth. The Department of Education has announced that those who have received the DSC2024 recruitment documents will be given post on October 15.
The DEOs were directed to attend the counseling in the offices indicated. Candidates are advised to bring appointment letter along with two passport size photographs. Counseling will be done according to merit based on ranks, he said. As a result, the candidates are waiting in the queue in front of the offices from this morning The latest is that the Education Department has announced that the DSC counseling is being postponed.