తగ్గిన అల్ట్రాటెక్ సిమెంట్ లాభం
జాతీయ National News భారత్ ప్రతినిధి : అల్ట్రాటెక్ సిమెంట్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.825.18 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.1,280.38 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గింది. రెవెన్యూ రూ.16,012.13 కోట్ల నుంచి రూ.15,634.73 కోట్లకు పడిపోయింది. ఆగస్టులో భారీ వర్షాల కారణంగా సిమెంట్ కంపెనీల సేల్స్ పడిపోయాయి.
అల్ట్రాటెక్ సిమెంట్ రెవెన్యూ కూడా తగ్గింది. కంపెనీ షేర్లు సోమవారం 1.69 శాతం తగ్గి రూ.10,874 వద్ద సెటిలయ్యాయి. కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్‌ను తయారు చేసే యూఏఈ కంపెనీ రస్ అల్‌ఖైమాలో వాటాను 54.79 శాతానికి పెంచుకున్నామని, దీంతో కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో తాజా ఫలితాలను పోల్చకూడదని అల్ట్రాటెక్ పేర్కొంది.
Ultratech Cement posted a net profit (consolidated) of Rs 825.18 crore in the quarter ended September this year. Compared to Rs.1,280.38 crore in the September quarter of last year, it has decreased drastically. Revenue fell from Rs 16,012.13 crore to Rs 15,634.73 crore. Sales of cement companies fell due to heavy rains in August.
Ultratech Cement revenue also declined. Shares of the company settled down 1.69 percent at Rs 10,874 on Monday. Ultratech stated that it has increased its stake in the UAE company Ras Al Khaimah, which manufactures construction materials, to 54.79 percent, so the latest results should not be compared with the September quarter of last year.