వార్తలు అవాస్తవం టికెట్ ధరల పెంపుపై స్పందించిన సజ్జనార్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ విపరీతంగా టికెట్ ధరలు పెంచిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. జీవో ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలను సంస్థ సవరించిందని, రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
పండగ సమయాల్లో జీవో ప్రకారం స్పెషల్ సర్వీసుల్లో టికెట్ ధరలను సవరించడం జరుగుతుందని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణ రోజుల్లో టికెట్ ధరలు యథావిధిగా ఉంటాయని వెల్లడించింది. జీవో ఆ వెసులుబాటును సంస్థకు ఇచ్చిందని పేర్కొంది.
ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీలో 9 వేలకు పైగా బస్సులు సేవలందిస్తున్నాయి. పండుగ సమయాల్లో రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు సగటున 500 స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతోంది. ఆ 500 స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీల సవరణ ఉంటుంది. మిగతా 8500 రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. అని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
MD VC Sajjanar said that there is no truth in the ongoing campaign that TGSRTC has increased the ticket prices excessively in the background of Bathukamma and Dussehra festivals. He disclosed that according to Jivo, the organization revised the fares only in special buses and there was no change in the ticket fares of regular services. To this extent, he tweeted on the social media platform.
The management of TGSRTC has made it clear that the ticket prices of special services will be revised during the festive season. It has been revealed that the ticket prices will be as usual on normal days. Jio said that it has given that flexibility to the company.
"At present, more than 9,000 buses are operating in TGSRTC. The company is running an average of 500 special buses every day in accordance with the rush. There will be no change in the fares of the other 8500 regular services," said MD V C Sajjanar said in a tweet.