హిమచల్‌లో మౌంటెన్‌ను అధిరోహించిన అన్నాచెల్లెలు
జాతీయ National News భారత్ ప్రతినిధి : హిమాచల్‌ప్రదేశ్ మనాలీలోని మౌంటెన్(14,600ఫీట్లు)ను రాయికల్ మండలం ఆలూర్‌కు అన్నాచెల్లెలు లక్కం మణిరాజ్, లక్కం రషిత అధిరోహించారు. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 7న పర్వతారోహణ చేసిన బృందంలో వీరిద్దరూ ఉన్నారు. కోచ్ దీకొండ శివరామకృష్ణ ఆధ్వర్యంలో వీరు శిక్షణ పొందారు.
కరీంనగర్‌లోని శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీలో ఇంటర్ చదువుతున్నారు. బుధవారం అన్నాచెల్లెలను శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత ఎం.రమేశ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాంరెడ్డి, గ్రామస్తులు భాస్కర్ రావు, సురేందర్ రెడ్డి ప్రశంసించారు.
Anna's sisters Lakkam Maniraj and Lakkam Rashita climbed the mountain (14,600 feet) in Manali, Himachal Pradesh to Alur in Raikal Mandal. Both of them were part of the team that climbed the mountain on 7th of this month to spread awareness about drug prevention. They trained under coach Deekonda Sivaramakrishna.
He is studying inter at Sri Chaitanya Defense and Sports Academy, Karimnagar. On Wednesday, M. Ramesh Reddy, former sarpanch Ram Reddy, villagers Bhaskar Rao and Surender Reddy praised Annachelle.