స్కిల్స్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు
జాతీయ National News భారత్ ప్రతినిధి : మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా చేసిన కృషికి గానూ.. మహారాష్ట్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం పేరును రతన్ టాటా మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీగా మార్చనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీయల్ అవార్డులను రతన్ టాటా పేరుతో ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే అంతేగాకుండా రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రతిపాదిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో అక్టోబర్ 9న రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో రతన్ టాటా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
సంపాదన, లాభాల్లో 60% దానధర్మాలకే....
మధ్య తరగతి ప్రజల కలలను సాకారం చేయడానికి రతన్ టాటా 2015లో నానో కారును తీసుకొచ్చారు. రూ. లక్షకే దీనిని అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా టాటా నానో సామాన్యుల కారుగా పేరుగాంచింది. కాగా, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ను స్థాపించి తన కంపెనీల ద్వారా వచ్చిన లాభాలలో 60 నుంచి 65 శాతం దాతృత్వ ప్రయోజనాల కోసం రతన్ టాటా విరాళంగా అందించారు. రతన్ టాటాను కేంద్రం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. దేశవిదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో గౌరవించాయి.
Government of Maharashtra has taken a crucial decision. In recognition of the efforts made by Indian industrial giant Ratan Tata, the name of Maharashtra State Skill Development University has been announced to be changed to Ratan Tata Maharashtra State Skills Development University.
It is known that Maharashtra government has already decided to give industrial awards in the name of Ratan Tata.. Moreover, the state cabinet has passed a resolution proposing Bharat Ratna, the country's highest award to Ratan Tata. It is known that Ratan Tata breathed his last at Breach Candy Hospital in Mumbai on October 9 due to old age related illness.
Ratan Tata brought the Nano car in 2015 to fulfill the dreams of middle class people. Rs. It has been made available for only one lakh. Tata Nano is known as the common man's car all over the world. Meanwhile, Ratan Tata donated 60 to 65 percent of the profits of his companies for charitable purposes by establishing the Sir Dorabji Tata Trust. Center honored Ratan Tata with Padma Vibhushan and Padma Bhushan awards. Famous universities abroad have honored him with honorary doctorates.