కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చిన స్విగ్గీ, జొమాటో
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజులను మరోసారి పెంచాయి. పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగడంతో ‘ఫెస్టివల్ సీజన్ ప్లాట్‌ఫామ్ ఫీజు’ కింద ఆర్డర్‌కు రూ.10 ను జొమాటో ఛార్జ్ చేస్తోంది. ఈ పెరిగిన రేటు ఢిల్లీ, హైదరాబాద్‌తో సహా మరికొన్ని సిటీలలో అమల్లోకి వచ్చింది. స్విగ్గీ కూడా ప్లాట్‌ఫామ్ ఫీజును తాజాగా పెంచింది. ఈ కంపెనీ 2023 ఏప్రిల్‌లో రూ.2 ప్లాట్‌ఫామ్ ఫీజును వేయడం మొదలు పెట్టింది. అదే ఏడాది ఆగస్టులో జొమాటో కూడా ప్లాట్‌ఫామ్ ఫీజులను వేయడం ప్రారంభించింది. ఫుడ్ ఆర్డర్‌పై వేసే డెలివరీ ఫీజులు, జీఎస్‌టీ, రెస్టారెంట్ ఛార్జీలు, హ్యాండ్లింగ్ ఛార్జీలకు అదనంగా ప్లాట్‌ఫామ్ ఫీజు పడుతుంది.
Online food delivery companies Zomato and Swiggy have once again increased the platform fees. Due to the increase in demand during the festival season, Zomato is charging Rs.10 per order under the 'Festival Season Platform Fee'. This increased rate has come into effect in other cities including Delhi and Hyderabad. Swiggy also hiked the platform fee recently. The company started charging a platform fee of Rs.2 in April 2023. In August of the same year, Zomato also started charging platform fees. Delivery fees, GST, restaurant charges and handling charges on food orders will be charged in addition to the platform fee.