పాకిస్థాన్ గెలవాలని కోరుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్
జాతీయ National News భారత్ ప్రతినిధి : పొరుగు దేశం పాకిస్థాన్ ఏ క్రీడలోనైనా ఇతర జట్లతో తలపడుతుందంటే ఓడిపోవాలని కోరుకుంటాం. ఆఖరికి అసోసియేట్ దేశాలతో తలపడుతున్నా మన మదిలో మెదిలే ఆలోచన దాయాది దేశం ఓడిపోవాలనే. అలాంటిది చరిత్రలో తొలిసారి పాకిస్థాన్ గెలవాలని కోరుకోబోతున్నాం సోమవారం జరిగే మ్యాచ్‌లో ఆ దృశ్యాలు చూడబోతున్నాం.
మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్-ఏలో భాగంగా సోమవారం పాకిస్థాన్- న్యూజిలాండ్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో పాక్ విజయం సాధిస్తే భారత్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. అదే పాక్ ఓడితే మాత్రం టీమిండియా ఇంటిదారి పట్టినట్లే. కివీస్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.
సెమీస్‌కు ఆసీస్....
ప్రస్తుతానికి గ్రూప్-ఏలో ఆడిన నాలుగింటిలోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక మిగిలింది ఒక స్తానం మాత్రమే. ఆ ఒక్క స్తానం కోసం మూడు జట్లు(న్యూజిలాండ్, పాకిస్థాన్, భారత్) రేసులో ఉన్నాయి. భారత్ 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో రెండో స్థానంలోఉండగా కివీస్ 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఈ ఇరు జట్ల మధ్య ఉన్న తేడా నెట్ రన్‌రేట్ మాత్రమే. కివీస్(+0.282) కంటే భారత మహిళా జట్టు (+0.322) కాస్త మెరుగైన స్థితిలోఉంది. ఇదే మనకు కలిసొచ్చే అంశం. ఇవాళ జరిగే మ్యాచ్‌లో పాక్ చేతిలో కివీస్ ఓడితే భారత్ జట్టు రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. అదే సమయంలో పాక్ భారీ తేడాతో విజయం సాధించకూడదని కోరుకోవాలి. ప్రస్తుతం పాక్ నెట్ రన్‌రేట్ (-0.488) మైనస్‌లలో ఉంది. భారీ తేడాతో గెలిస్తే నెట్ రన్‌రేట్ మెరుగుపడి పాక్ సెమీస్ చేరొచ్చు.
Neighboring country Pakistan wants to lose in any sport against other teams. In the end, even if we face the associate countries, the thought in our mind is that the cousin country should be defeated. We are going to want Pakistan to win such a thing for the first time in history We are going to see those scenes in the match on Monday.
A crucial match between Pakistan and New Zealand will be held on Monday as part of Women's T20 World Cup Group-A. If Pakistan wins in this, there are chances of India reaching the semis. If Pakistan loses, it's like Team India will go home. Kiwis qualify for semis.
Australia has won all four games played in Group-A so far and has advanced to the semi-finals. Only one sthana remains. Three teams (New Zealand, Pakistan, India) are in the race for that one spot. While India is in the second position with two wins in 4 matches, Kiwis is in the third position with two wins in 3 matches. The only difference between these two teams is the net run rate. The Indian women's team (+0.322) is slightly better than the Kiwis (+0.282). This is what unites us.
If the Kiwis lose to Pakistan in today's match, the Indian team can secure the second position. At the same time, Pakistan should not want to win by a huge margin. Presently Pak Net Runrate (-0.488) is in the minuses. If they win with a huge margin, the net run rate will improve and Pakistan can reach the semis.