Type Here to Get Search Results !

Sports Ad

టెలిగ్రాం యూజర్ల కొంప మునిగింది మనకు తెలియకుండా ఇంత జరుగుతోందా Telegram Users Are Drowning Is This Happening Without Our Knowledge

టెలిగ్రాం యూజర్ల కొంప మునిగింది మనకు తెలియకుండా ఇంత జరుగుతోందా

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీస్ అయిన టెలిగ్రామ్ యూజర్ల కొంప మునిగింది. టెలిగ్రాంలో ఏఐ పవర్డ్ చాట్బాట్స్ను వాడి అశ్లీల ఫొటోలు క్రియేట్ చేస్తున్నట్లు తేలింది. టెలిగ్రాంలో దాదాపు 4 మిలియన్ల మంది ఈ పాడు పనులు చేస్తు్న్నట్లు అమెరికన్ వెబ్సైట్ Wired రిపోర్ట్ చేసింది. అంతేకాదు డీప్ఫేక్స్ క్రియేట్ చేసేందుకు టెలిగ్రాంను అడ్డాగా మార్చుకున్నట్లు తెలిసింది. టెలిగ్రాం యూజర్లుగా ఉన్న అమ్మాయిల ఫొటోలు, మహిళల ఫొటోలను వాడుకుని ఆ ఫొటోలను డీప్ ఫేక్ సాయంతో దుస్తులు లేకుండా చిత్రీకరించడం, శృంగార వీడియోల్లో ఆ ఫొటోలను వాడటం చేస్తున్నారని వైర్డ్ బయటపెట్టింది. 

 డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల ఎంత మంచి ఉందో, అంతే చెడు కూడా ఉందని మరోసారి ఈ పరిణామం రుజువు చేసింది. ఈ టెక్నాలజీ సాయంతో చనిపోయిన నటులను లేదా వ్యక్తులను ఉనికిలోకి తేవచ్చు. ప్రాణం పోయలేం గానీ ఈ టెక్నాలజీ సాయంతో చనిపోయిన వ్యక్తి ఫొటోను ఉపయోగించి ఆ వ్యక్తితో మాట్లాడించవచ్చు. హావభావాలను పలికించవచ్చు. అయితే ఈ టెక్నాలజీని కొందరు నీచమైన పనులకు వినియోగిస్తుండటం శోచనీయం. 

 డీప్ ఫేక్ సాయంతో సినీ నటి రష్మిక ఫొటోను వాడి ఆమె మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పరిణామం ఆమెను మానసికంగా కుంగదీసింది. ఇలా ఎంతో మంది అమ్మాయిలు, మహిళల ఫొటోలను వాడుకుంటూ టెలిగ్రామ్లో న్యూడ్ ఫొటోలను, వీడియోలను క్రియేట్ చేస్తున్నట్లు స్పష్టమైంది. టెలిగ్రామ్ దుర్వినియోగం పెరిగిపోవడంతో సదరు మెసేజింగ్ సర్వీస్పై ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.

 భారత ప్రభుత్వం టెలిగ్రామ్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిందని, ఇండియాలో టెలిగ్రాంపై నిషేధం విధించాలని డిసైడ్ అయిందని వార్తలు కూడా వచ్చాయి. భారత్లో దాదాపు 104 మిలియన్ల మంది టెలిగ్రాం యూజర్లు ఉన్నారు. టెలిగ్రాంను ఇతర దేశాల్లో కంటే ఎక్కువగా వినియోగిస్తుంది ఇండియాలోనే కావడం గమనార్హం. టెలిగ్రాం యూజర్లలో 20 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు.

Users of Telegram, an instant messaging service, are in trouble. It has been revealed that AI powered chatbots on Telegram are creating pornographic photos. American website Wired reported that almost 4 million people are doing this dirty work on Telegram. Moreover It is known that telegram has been changed to adda to create deepfakes. Wired has revealed that the photos of girls and women who are Telegram users are being used and those photos are being photographed without clothes with the help of deep fake, and those photos are being used in romantic videos. 

 This development once again proves that deep fake technology has as much good as bad. With the help of this technology dead actors or people can be brought into existence. Life cannot be lost but with the help of this technology one can talk to the dead person using the photo. Gestures can be expressed. However, it is unfortunate that some people are using this technology for nefarious purposes. 

 It is known that movie actress Rashmika created her morphing video with the help of deep fake. As the video went viral on social media, this development left her mentally crippled. It is clear that many people are creating nude photos and videos on Telegram using the photos of girls and women. Recently, there have been a lot of accusations against the messaging service due to the increasing misuse of Telegram.

 There are also news that the Indian government has decided to curb the misuse of Telegram and has decided to ban Telegram in India. There are about 104 million Telegram users in India. It is noteworthy that Telegram is used more in India than in other countries. More than 20 percent of Telegram users are Indians.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies