Type Here to Get Search Results !

Sports Ad

దీపావళి రోజు దీపాలు ఎందుకు పెట్టాలి టపాసులు ఎందుకు కాల్చాలి సైంటిఫిక్ రీజన్ ఇదే This Is The Scientific Reason Why Lights Should Be Lit On Diwali Day And Why Tapas Should Be Burnt

దీపావళి రోజు దీపాలు ఎందుకు పెట్టాలి టపాసులు ఎందుకు కాల్చాలి సైంటిఫిక్ రీజన్ ఇదే

జాతీయ National News భారత్ ప్రతినిధి : హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు పురాణాల ప్రకారం పెద్ద చరిత్ర ఉంది.  దీపావళి పండుగను దీపాల పండుగ అంటారు.  అష్టాదశపురాణాల ప్రకారం దీపం అంటే పరబ్రహ్మ స్వరూపం అందుకే దీపావళి రోజున దీపాలతో ఇంటిని అలంకరిస్తారు.  ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున( అక్టోబర్ 30)  దీపాల పండుగ ప్రారంభమవుతుంది.  అప్పటి నుంచి కార్తీక మాసంలో కూడా సంధ్యా సమయంలో ( సాయంత్రం) ప్రమిదలలో నూనె తోకాని ఆవు నెయ్యి తో కాని దీపాలు వెలిగిస్తారు. ఇంటి గుమ్మం దగ్గర తులసి చెట్టు దగ్గర ఇంట్లో దేవుడి దగ్గర దీపాలు పెడతారు.  సైన్సు ప్రకారంగా పరిశీలిస్తే ఈ సమయంలో చలి మొదలవుతుంది.  శీతాకాలం ప్రవేశంతో జలుబు దగ్గు కఫం మొదలగు శ్వాశ కోస వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.  దీనికి విరుగుడుగా నువ్వులనూనె ఆవునెయ్యితో వెలగించిన దీపపు పొగను పీల్చినా ఆ దీపం సెగ తగిలినా  ఇలాంటి వ్యాధుల నుంచి దరి చేరవని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.  అందుకే కార్తీకమాసం నెల రోజులు ఆవునెయ్యితో దీపం పెట్టుకుంటారు. 

 ఇక టపాసుల విషయానికొస్తే శ్రీరాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగివచ్చిన రోజని సత్యభామ నరకాసురుని చంపిన తరువాత రోజు అందరూ సంబరాలతో టపాసులు కాల్చి వేడుకలు చేసుకున్నారని పురాణాల కథ.  ప్రకృతి పరంగా పరిశీలిస్తే మన దేశం వ్యవసాయాధార దేశం.  వర్షాకాలంలో విత్తిన  పంటలు శీతాకాలంలోనే వృద్ది చెందుతాయి.  దీపావళి పండుగ శీతాకాలం ప్రారంభంలో వస్తుంది. క్రిములు కీటకాలు పంటలను నాశనం చేస్తాయి.  దీంతో పంట దిగుబడి తగ్గి రైతు ఆదాయం తగ్గిపోతుంది. అంతే కాకుండా ఈ కీటకాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతారు.  వీటిని నాశనం చేసేందుకు గంధకం కాల్చగా వచ్చే పొగ అందుకే దీపావళి రోజున కాల్చే టపాసుల్లో గంధకం వాడతారు.  గాలిలో గంధకం పొగ వ్యాపించి కీటకాలను నివారిస్తుంది. 

 దీపావళి రోజు లక్ష్మీపూజ చేస్తే సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.దీనికి సంబంధించి పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి  దుర్వాస మహర్షి ఒకరోజు దేవేంద్రుని (ఇంద్రుడి) ఆతిథ్యానికి వెళ్లాడు.  అప్పుడు ఇంద్రుడికి మహర్షి ఓ హారాన్నిస్తాడు. దానిని తీసుకున్న ఇంద్రుడు  తన ఐరావతం  ( ఏనుగు) మెడలో వేస్తాడు. అప్పుడు ఆ ఏనుగు హారాన్ని కాలితో తొక్కి నాశనం చేస్తుంది. అసలు దుర్వాస మహర్షికి కోపం చాలా ఎక్కువ. ఆయనకు కోపం తట్టుకోవడం చాలా కష్టం. దీంతో  ఆగ్రహించిన దుర్వాస మహర్షి కోపంతో రగిలిపోయిన మహర్షి దేవేంద్రుడిని శపిస్తాడు.  

 దుర్వాస మహర్షి శాప ఫలితంగా ఇంద్రుడు తన స్థానాన్ని సర్వసంపదలను కోల్పోతాడు.  ఈ సమయంలో దిక్కు తోచక ఇంద్రుడు శ్రీమహావిష్ణువుని ప్రార్థిస్తాడు.  అప్పుడు మహావిష్ణువు  ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని ఉపదేశిస్తాడు. ఇంద్రుడు అలా చేసిన తర్వాత పోయిన సిరిసింపదలు,శక్తులు తరిగొచ్చాయని పురాణ కథనం. అప్పటి నుంచి లక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వసంపదలూ చేకూరతాని విశ్వసిస్తారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies