Type Here to Get Search Results !

Sports Ad

రేవంత్ సర్కారుకు బిగ్‌షాక్ హైకోర్టులో పిటిషన్ వేయనున్న వేలాది మూసీ బాధితులు in hyderabade

 రేవంత్ సర్కారుకు బిగ్‌షాక్ హైకోర్టులో పిటిషన్ వేయనున్న వేలాది మూసీ బాధితులు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రేవంత్ రెడ్డి సర్కారుకు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. వేలాది మంది ఒకేసారి హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా తమ నివాసాలను కూలుస్తోందని, పునరావాసం కల్పించకుండా తాము ఉంటున్న నిర్మాణాలను ఒక్కసారిగా కూల్చివేస్తే తామంతా ఎక్కడికి వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపధ్యంలోనే తమకు న్యాయం చేయాలని కోరుతూ కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం. 

   అయితే, ప్రభుత్వం మాత్రం మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి, మూసీ సుందరీకరణలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేయడానికి వచ్చిన వారికి రూ.25వేలు అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మొన్నటివరకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను బుల్డోజర్‌లతో కూల్చివేయించిన ప్రభుత్వం మూసీ నిర్వాసిత ఇళ్లను మాత్రం కూలీలను పెట్టించి కూలగొట్టిస్తోంది.

The people of Musi catchment area gave a big shock to the Revanth Reddy government. Thousands of people prepared to file a petition in the High Court at once. The Telangana government is illegally demolishing their homes without rehabilitating them They are expressing their concern, where will they all go if the structures they are staying in are demolished at once. In this context, it is reported that they will approach the court asking for a stay on the demolitions, 

  seeking justice for them.However, it is known that the government has announced that they are undertaking this project as part of the development of the Moosi catchment area and the beautification of Moosi, and they will give Rs.Until recently, the government, which demolished the structures under the FTL and buffer zone with bulldozers, is demolishing the houses of the displaced people by employing labourers.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies