ఏం టెక్నాలజీరా బాబూ వాట్సాప్ వెబ్ వాడే వాళ్లకు గుడ్ న్యూస్
జాతీయ National News భారత్ ప్రతినిధి : స్మార్ట్‌ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్, ట్యాబ్, పీసీ లాంటి మరికొన్ని డివైజ్‌ల్లో కూడా ‘వాట్సాప్ వెబ్’ వాడుతుంటారు. అయితే అలా వాడే డివైజ్లతో వాట్సాప్ కాంటాక్ట్స్ సేవ్ చేసుకునే అవకాశం లేదు. కొత్త కాంటాక్ట్ సేవ్ చేయాలంటే ప్రైమరీ డివైజ్‌ని చేతిలోకి తీసుకోవాల్సిందే. లింక్డ్ డివైజెస్‌లో అప్పటికే సేవ్ చేసిన కాంటాక్ట్ లిస్ట్ మాత్రమే చూపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ లింక్ చేసిన డివైజ్‌ల్లో కూడా కాంటాక్ట్‌ని సేవ్ చేసేలా కొత్త ఫీచర్ తెచ్చేందుకు వాట్సాప్ రెడీ అయ్యింది.
ఇప్పటివరకు వాట్సాప్ ‘మొబైల్–ఓన్లీ కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్’తో పనిచేసేది. కానీ ఇందులో మార్పు తీసుకురానుంది. ఇక నుంచి వాట్సాప్‌ని ఏ డివైజ్‌లో వాడుతున్నా అందులోనే కొత్త కాంటాక్ట్‌ని సేవ్ చేసుకోవచ్చు.మరికొన్ని రోజుల్లో ఈ ఫీచర్‌ని యూజర్లు అందరికీ తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతేకాదు ఈ ఫీచర్లో మరో ప్రత్యేకత ఉంది.
అదేంటంటే సేవ్ చేస్తున్న కాంటాక్ట్ వాట్సాప్‌లోనే సేవ్ చేయాలా లేదా డివైజ్ స్టోరేజీలో కూడా సేవ్ చేయాలా అనేది సెలక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫోన్ పోయినా, మార్చినా కాంటాక్ట్స్ మాత్రం వాట్సాప్‌లో సేవ్ అవుతాయి. ఒకవేళ కొత్త డివైజ్‌లో లాగిన్ అయిన వెంటనే పాత కాంటాక్ట్స్ అన్నీ రీస్టోర్ అవుతాయి ఈ ఫీచర్ వల్ల.