ధర్నాకు దిగిన కానిస్టేబుళ్ల భార్యలు పాత పద్ధతిలో లీవ్స్ ఇవ్వాలని డిమాండ్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పాత పద్ధతిలో లీవ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టెన్త్ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు గురువారం నేషనల్ హైవేపై ధర్నాకు దిగి బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది వరకు15 రోజులకు ఒకసారి లీవ్స్ ఉండేవన్నారు. కానీ నవంబర్ 1 నుంచి నెల రోజులకు ఒకసారి లీవ్స్ వచ్చేలా డిపార్ట్మెంట్ వారు మ్యానువల్ రూపొందించారన్నారు. పాత పద్ధతినే లీవ్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని రోడ్డుపై బైఠాయించిన వారిని పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు.
Wives of Tenth Battalion constables staged a dharna on the National Highway on Thursday, demanding to be given old-fashioned leaves. On this occasion, they said Until now, they used to have leaves once in 15 days.But the department has made a manual so that leaves can be given once a month from November 1. They protested demanding that leaves be granted in the old way. The police reached the spot and removed the people who were encamped on the road and restored the flow of traffic.