Type Here to Get Search Results !

Sports Ad

మూడు రోజుల్లో 10 ఏనుగులు మృతి బాంధవ్గడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఏం జరిగిందంటే 10 Elephants Died In Three Days What Happened In Bandhavgad Reserve Forest

మూడు రోజుల్లో 10 ఏనుగులు మృతి బాంధవ్గడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఏం జరిగిందంటే

జాతీయ National News భారత్ ప్రతినిధి : మధ్యప్రదేశ్ లోని బాంధవ్ గఢ్ రిజర్వ్ ఫారెస్ట్ లో మూడు రోజులు వ్యవధిలో 10 ఏనుగులు చనిపోయాయి. మంగళవారం నాలుగు ఏనుగులు బుధవారం నాడు మరో నాలుగు గురువారం మరో రెండు ఏనుగులు ఇలా మూడు రోజులు వ్యవధిలో 10 ఏనుగులు చనిపోయాయి. పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ బీట్ గార్డుల సమాచారంలో అటవీశాఖ అధికారులు, వెటర్నరీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన ఏనుగులను ఖననం చేశారు. అయితే కేవలం మూడు రోజుల వ్యవధిలో 10 ఏనుగులు ఎలా చనిపోయాయి అన్నదే మిస్టరీగా మిగిలింది. ఏనుగుల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు స్టేట్ టైగర్ స్ట్రైక్ ఫోర్స్ తో సహా మధ్యప్రదేశ్ కు చెందిన పలు దర్యాప్తు బృందాలు రిజర్వ్ ఫారెస్ట్ కు వెళ్లాయి.

 ఘటనా స్థలానికి  5 కిలోమీటర్ల దూరంలో నీటి వనరులు, ఏనుగుల కదలికలు, ఆ ప్రాంతంలో పండించే పంటలను పరిశీలించారు. విచారణకోసం స్థానికంగా నివాసం ఉండే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఏనుగుల మృతికి ఖచ్చితమైన కారణం తెలియలేదు కానీ బాంధవ్ గఢ్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో రైతులు పండించే కోడ్ పంటను తిని ఏనుగులు మృతి చెంది ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. ఏనుగుల పోస్ట్ మార్టమ్ రిపోర్టు వస్తేగానీ స్పష్టమైన కారణాలు తెలిసి రావొచ్చంటున్నారు. 

2017 నుంచి బాంధవ్ గఢ్ ఫారెస్ట్ లో...
ఈ ఏనుగులు 2017లో పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి బాంధవ్గఢ్ కు వలస వచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. అక్టోబరు 31, 2018న ఏనుగులు షాదోల్ అటవీ ప్రాంతం నుంచి పాన్‌పాడా సరిహద్దు గుండా బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌కు వచ్చాయి.  ఏనుగులు మృతి చెందడం బాధాకరం అని మాజీ అటవీ రేంజర్ పుష్పేంద్ర నాథ్ ద్వివేది చెప్పారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies