ఏపీ తెలంగాణలో పుష్ప 2 కి భారీ టార్గెట్ ఎన్ని కోట్లు కలెక్ట్ చెయ్యాలంటే
Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2: ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 డిసెంబర్ 05న గ్రాండ్ గా ప్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నవంబర్ 17న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా వరల్డ్ వైడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా రూ.22 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. దీంతో పుష్ప 2 సినిమాపై రోజరోజుకి హైప్ పెరుగుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో టికెట్ రేట్లు, బక్సాఫిస్ కలెక్షన్లు వంటివాటి గురించి నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
అయితే పుష్ప 2 ఇప్పటికే రిలీజ్ కి ముందే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి దాదాపుగా రూ.1060 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఏపీ - తెలంగాణ రాష్ట్రలోలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపుగా రూ.225 కోట్లు(షేర్) ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో జీఎస్టీ, థియేటర్ రెంట్, ఇతర ఖర్చులు అదనం. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అని చెప్పవచ్చు.
ఇప్పటివరకూ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ (గ్రాస్ : రూ.398.కోట్లు, షేర్ : రూ.239.3 కోట్లు) బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (గ్రాస్ : రూ.303.8 కోట్లు, షేర్ : రూ.205.1 కోట్లు), ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898-AD (గ్రాస్ : రూ.284.1 కోట్లు, షేర్ : రూ.161.2 కోట్లు), కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన దేవర పార్ట్ 1 (గ్రాస్ : రూ.220 కోట్లు, షేర్ : రూ.129 కోట్లు), ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ (గ్రాస్ : రూ.217.3 కోట్లు, షేర్ : రూ.127.6 కోట్లు) సినిమాలు అత్యధిక షేర్ కలెక్షన్లు సాధించిన చిత్రాలు టాప్ 5 లో ఉన్నాయి. ఒకవేళ పుష్ప 2 గనుక బ్రేక్ ఈవెన్ టార్గెట్ బ్రేక్ చేస్తే ఇండస్ట్రీలో టాప్ గా నిలుస్తుంది.
భారీ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండటంతో టికెట్ రేట్లు కూడా ఇదే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే మేకర్స్ కి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాయి. దీంతో సింగిల్ స్క్రీన్స్ లో రూ.350 నుంచి రూ.375, మల్టీ ప్లెక్స్ లో రూ.600 నుంచి రూ.700 గా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు డిసెంబర్ 05న 12.45 గంటలకే ప్రీమియర్ షోలు వేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రీమియర్ షో టికెట్ ధర దాదాపుగా రూ.1000కి పైగా ఉంటుందని సమాచారం. వీటినిబట్టి చూస్తే ప్రీమియర్ షోలలో పాజిటివ్ టాక్ పడితే సులభంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.