Type Here to Get Search Results !

Sports Ad

గ్రూప్ 2 ఎగ్జామ్‎లో సక్సెస్ కొట్టాలనుకుంటున్నారా అయితే ఈ టిప్స్ పాటిస్తే బెస్ట్ రిజల్ట్ If You Want To Succeed In Group 2 Exam Then Follow These Tips For Best Result

గ్రూప్ 2 ఎగ్జామ్‎లో సక్సెస్ కొట్టాలనుకుంటున్నారా అయితే ఈ టిప్స్ పాటిస్తే బెస్ట్ రిజల్ట్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసిన లక్షల మంది నిరుద్యోగుల కలల కొలువు గ్రూప్​-2.  దాదాపు అయిదు లక్షల మందికి పైగా పోటీపడే ఈ పరీక్ష కోసం ఎంతోకాలంగా అభ్యర్థులు అకుంఠిత దీక్షతో ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగిస్తున్నారు. ఎన్ని నెలలు కృషి చేసినా ఎన్ని పుస్తకాలు చదివినా పరీక్షకు ప్రస్తుతం ఉన్న నెలరోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు చదివిన అంశాలను రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవడంలోనే సక్సెస్​ ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 పరీక్షలో విజయానికి మెలకువలు తెలుసుకుందాం.

 మొత్తం నాలుగు పేపర్లుగా ఉండే గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 పరీక్షలను డిసెంబర్​ 15, 16వ తేదీల్లో నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి నుంచి సుమారు 30రోజుల సమయం అభ్యర్థులకు అందుబాటులో ఉంది. ఎంతో విలువైన ఈ సమయంలో ముఖ్యాంశాల రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలు పరీక్ష రోజున అనుసరించాల్సిన వ్యూహంపై అభ్యర్థులు పూర్తి ప్లానింగ్​తో వ్యవహరించాలి.

రివిజన్‌: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఇప్పటివరకు తాము చదివిన అంశాల అవలోకనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆయా అంశాలకు నిర్దిష్టంగా సమయం కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రస్తుతం కొత్త పుస్తకాల జోలికి వెళ్లడం సరికాదు. ఇప్పటివరకు చదివిన అంశాలను నిర్వచనం మొదలు తాజా పరిణామాల వరకూ..మళ్లీ మళ్లీ వేగంగా రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుండాలి. ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సమయంలో అభ్యర్థులు తయారు చేసుకున్న సొంత నోట్స్​ ఈ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. 

 ప్రస్తుత సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పాయింట్లతో రాసుకున్న నోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పదే పదే చదువుతూ ముందుకు సాగాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే ఆయా వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుండా వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు అధ్యయనం చేయాలి.

కామన్​ టాపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్: ప్రస్తుత సమయంలో ఆయా పేపర్లలో ఉన్న కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏకకాలంలో చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోని ఉమ్మడి అంశాలను గుర్తించి వాటిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా విలువైన సమయం ఆదా అవుతుంది. జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టడీస్, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలేషన్స్, భారత రాజ్యాంగం, పరిపాలన, ఎకానమీ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇలా అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది. ప్రతి రోజు సగటున కనీసం 10 గంటలు ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమయం కేటాయించాలి. ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమయంలో అభ్యర్థులు కష్టంగా భావించి కొన్ని టాపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చదవకుండా పక్కన పెట్టేస్తారు. వాటిలో ముఖ్యమైన టాపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఇప్పుడు కొంత సమయం కేటాయించాలి. 

ప్రభుత్వ విధానాలు:  అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర పభుత్వాల తాజా విధానాలు, పథకాలపై దృష్టి పెట్టడం మేలు చేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యాంరెంటీలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఆర్థిక, సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు రూపొందించిన విధానాలపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు మహిళా సాధికారత వంటివి. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, ఎస్సీలు, గిరిజనులు, వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పథకాలు తెచ్చారు. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి. తెలంగాణ పాలసీలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు, దానికి సంబంధించి ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్న నీళ్లు నిధులు నియామకాలపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి.

పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–4 స్కోరింగ్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–4. ఇది గరిష్టంగా స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు అవకాశమున్న పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘తెలంగాణ ఆలోచన(1948–1970), ఉద్యమ దశ(1971–1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం(1991–2014) దశగా పేర్కొన్నారు. ముఖ్యంగా 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకూ జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు వాటి సిఫార్సులు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థీకరణ బిల్లులో పొందుపరచిన అంశాల నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

మాక్​టెస్టులతో మేలు: ప్రస్తుతం ఉన్న సమయంలో ప్రిపరేషన్​ పూర్తయిన అభ్యర్థులు ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు హాజరవడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో తమకు ఇప్పటివరకు లభించిన పరిజ్ఞాన స్థాయిపై అవగాహన లభిస్తుంది. ఇంకా చదవాల్సిన అంశాల విషయంలో స్పష్టత వస్తుంది. పొరపాట్లను విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.

ఆరోగ్యం జాగ్రత్త : సిలబస్​ ఎక్కువ ఉండడంతో రివిజన్​అయిపోవాలనే తొందరలో అభ్యర్థులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. బయట ఫుడ్​ఎక్కువగా తింటూ, సరిగా నిద్ర లేకపోవడం వలన అనారోగ్యానికి గురవుతుంటారు. దీంతో విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఒత్తిడికి గురవకుండా ఇప్పుడున్న టైమ్​ను ప్రణాళిక ప్రకారం సద్వినియోగం చేసుకుంటేనే పరీక్షలో విజయం సాధించవచ్చు. 

ఎగ్జామ్​హాల్​టిప్స్: ఎంత కష్టపడి చదివినా పరీక్ష రోజున రెండున్నర గంటల వ్యవధిలో చూపే ప్రతిభే సక్సెస్‎ను డిసైడ్​ చేస్తుంది. ఓఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తప్పులు లేకుండా నింపడంతోపాటు సమాధానాలు బబ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే క్రమంలో ప్రశ్న సంఖ్య, ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్షుణ్నంగా గుర్తించాలి. ముందుగా ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కొంత సమయం కేటాయించాలి. 

 ఫలితంగా ప్రశ్న పత్రం క్టిష్ట స్థాయిపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. ఆబ్జెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంలో ఉండే ప్రిలిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్షలో ఎక్కువ మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిస్తారు. ఈ టెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌­ను పరీక్ష చివరి దశలో అమలు చేయా­లి. అప్పటికే తమకు సమాధానాలు తెలిసి­న అన్ని ప్రశ్నలను పూర్తి చేసుకున్నామని భావించా­కే ఎలిమినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా గెస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టాలి.

జాబ్ డిసైడ్​ చేసే పేపర్​ 1 :  సీరియస్​గా ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులు సైతం పాలిటీ, సొసైటీ, చరిత్ర, తెలంగాణ ఉద్యమం, ఎకానమీ మీద పెట్టినంత ఫోకస్​ పేపర్​1 మీద చేయకపోవడం తో ఇందులో తక్కువ మార్కులు వస్తున్నాయి. మొదటి పేపర్​లో ముఖ్యంగా కరెంట్​ ఎఫైర్స్​, అంతర్జాతీయ అంశాలు, జనరల్​ సైన్స్​, ఇంగ్లీష్​, రీజనింగ్​ నుంచి అధిక మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ సబ్జెక్టులను నిర్లక్ష్యం చేస్తే కొలువు కొట్టడం కష్టంగా మారొచ్చు. ఇప్పుడున్న సమయంలో ఈ అంశాల మీద ఫోకస్​ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. 

‘స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ :  తెలంగాణకు సంబంధించిన అంశాల మీదే దాదాపు సగం మార్కులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన  హిస్టరీ, జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీపై గట్టి పట్టు సాధించాలి. తెలంగాణ చరిత్రకు సంబంధించి ఆయా రాజ వంశాలు,శాసనా­లు, గ్రంథాలు, కవులు-రచనలు, కళలు, ముఖ్య కట్టడాలపై అవగాహన పెంచుకోవాలి. భారత స్వాతంత్య్రోద్యమ సమయం లో తెలంగాణలో జరిగిన ముఖ్య  సంఘటన­ల గురించి తెలుసుకోవాలి. తెలంగాణలోని ముఖ్యమైన నదులు-పరీవాహక ప్రాంతాలు ముఖ్యమైన పంటలు పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి.

 దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం, జనాభా వంటి వాటిపైనా అవగాహన అవసరం. ఎకానమీలో స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై పట్టు సాధించాలి. తాజా బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గణాంకాలు, ఆయా శాఖలు, పథకాలకు కేటాయింపులపై అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకానామిక్​ అవుట్​లుక్​ నుంచి ఎకానమీకి సంబంధించి అధిక సంఖ్యలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies