పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న ప్యాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 13500 స్క్రీన్స్ పుష్ప 2 కోసం కేటాయించినట్లు సమాచారం. ఇందులో మనదేశంలోనే 8500 స్క్రీన్స్ ఉండగా, ఇతర దేశాలలో 5000 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది.
అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో పుష్ప 2 టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ తదితరులు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు విషయంపై అనుమతులు కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేగాకుండా గతంలో నవీన్ యెర్నేని ఈ విషయం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సంప్రదించగా సానుకూలంగా స్పందించారని తెలిపాడు.
అలాగే సినిమా బడ్జెట్ ని బట్టి టికెట్ రేట్లు పెంచుకోవచ్చని సూచించినట్లు తెలిపాడు. దీంతో సింగిల్ స్క్రీన్ ధర లు ప్రస్తుతం రూ.175 ఉండగా రూ.300, మల్టీఫ్లెక్స్ లలో రూ.275 ఉండగా రూ.425 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పుష్ప 2 మొదటి రోజే దాదాపుగా రూ.350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ విషయం ఇలా ఉండగా నవంబర్ 17న పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా వరల్డ్ వైడ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్(అన్ని భాషలలో) సాధించిన మొదటి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఇటీవలే పుష్ప 2 షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.