3 రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన అమరన్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తమిళ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరిసామి దర్శకత్వంలో వచ్చిన అమరన్ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా అక్టోబర్ 31న ప్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ కాగా అన్నిచోట్ల మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాని ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ బేస్ చేసుకుని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి, శివ కార్తికేయన్ యాక్టింగ్, ఆర్మీ సెంటిమెంట్, రాజ్ కుమార్ టేకింగ్ వంటివాటితో అమరన్ కి కోలీవుడ్ లో మాత్రమే కాదు తెలుగు, మలయాళం, హిందీ భాషలలో కూడా డీసెంట్ కలెక్షన్లు రాబడుతోంది.
అయితే ఇప్పటికే హీరో విజయ్ పేరిట ఉన్న డే 2 హైయ్యేస్ట్ కలెక్షన్ల రికార్డులని అమరన్ బ్రేక్ చేసింది. దీనికితోడు ఈ సినిమా చూసినవారందరూ బాగుందంటూ మౌత్ టాక్ స్ప్రెడ్ చేయడంతో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. కాగా అమరన్ సినిమా రిలీజ్ అయిన 3 రోజుల్లోనే దాదాపుగా రూ.100 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమా వేగంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రాల క్లబ్ లో చేరింది. ఇప్పటివరకూ హీరో శివ కార్తికేయన్ నటించిన సినిమాలలో కేవలం 3 రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలోకలెక్షన్లు రాబట్టడం ఇదే మొదటిసారి.