Type Here to Get Search Results !

Sports Ad

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాద రూ.30 కోట్ల ఆస్తి నష్టం A Huge Fire In Ranga Reddy District Caused A Property Loss Of Rs.30 Crores

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాద రూ.30 కోట్ల ఆస్తి

 నష్టం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రంగారెడ్డి జిల్లాలో సోమవారం (నవంబర్ 6) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో అర్థరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతూ అందరూ చూస్తుండగానే క్షణాల్లో పూర్తిగా నేల మట్టం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

 ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న  ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐదు ఫైర్ ఇంజన్‎లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా మంటలు అదపులోకి రాలేదు. పరిశ్రమ పూర్తిగా అగ్నికి ఆహతి అయ్యింది. ఆస్తి నష్టం రూ.30 కోట్లకు పైగా ఉంటుందని పరిశ్రమ నిర్వాహకులు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies