Type Here to Get Search Results !

Sports Ad

ఒక్కో గుడ్లగూబకు రూ.50 వేలా దీపావళికే ఎందుకీ డిమాండ్ 50,000 Rupees Per Owl For Diwali

ఒక్కో గుడ్లగూబకు రూ.50 వేలా దీపావళికే ఎందుకీ డిమాండ్

జాతీయ National News భారత్ ప్రతినిధి : దీపావళి వచ్చిందంటే  గుడ్లగూబలకు  అక్రమంగా  ఫుల్ డిమాండ్  పెరుగుతోంది.  ఒక్కో గుడ్లగూబను రూ.10 వేల నుంచి 50 వేలు పలుకుతోంది. దీపావళికే  గుడ్లగూబలను ఎందుకు రేటు పెరుగుతుంది ఎందుకు కొంటారంటే అమవాస్య నాడు రాత్రి దీపావళికి గుడ్లగూబను బలి ఇస్తారంట. 

 అంతే కాదు గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. అందువల్ల గుడ్లగూబ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీపావళి రోజున ఎక్కడో గుడ్లగూబ కనిపిస్తే మీ అదృష్టం వరిస్తుందంటారు. దీపావళి సందర్భంగా మీకు కలలో గుడ్లగూబ కనిపిస్తే, అది జీవితంలో ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది. అయితే కలలో గుడ్లగూబ  కనిపిస్తే, అది ఆర్థిక నష్టానికి సంకేతం అని చెబుతుంటారు.

 హిందూ సంప్రదాయంలో గుడ్లగూబలు లక్ష్మీదేవికి దగ్గరి సంబంధం ఉందని చెబుతారు. లక్ష్మీ దేవి  గుడ్లగూబపై స్వారీ చేస్తుందని కొందరు  గుడ్లగూబ  ఆమెతోనే ఉంటుందని  మరికొందరు  చెబుతుంటారు. అందుకే గుడ్లగూబను దీపావళి రోజు రాత్రి బలి ఇవ్వడం వల్ల ఆ లక్ష్మీ దేవి ఇంట్లో  శాశ్వతంగా ఉంటుందనే నానుడి ఉంది.  భారత వన్యప్రాణుల చట్టం 1972 ప్రకారం గుడ్లగూబలను పట్టుకుని అమ్మితే మూడు  సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్షలు ఉన్నాయి. అయినప్పటికీ  ఈ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. 

లక్ష్మీ దేవి సోదరి...
అంతేకాకుండా గుడ్లగూబలు లక్ష్మీ దేవి సోదరి అరిష్ట లక్ష్మిగా చెబుతారు.  పురాణాల ప్రకారం  లక్ష్మీదేవి అమృతం నుంచి పుట్టిందని  ఆమె అక్క అలక్ష్మి హలాహల్ (విషం) నుంచి పుట్టిందని చెబుతున్నాయి. గుడ్లగూబలుకు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో దగ్గర ఒక్కో గుర్తింపు ఉంది.  గ్రీకు , ఆసియా సంప్రదాయాలు రెండింటిలోనూ  అవి సంపద, శ్రేయస్సు, శకునాలను సూచిస్తాయి. 
జ్ఞానానికి చిహ్నంగా గుడ్లగూబ...
గుడ్లగూబల  స్థిరమైన, గుండ్రని కళ్ళు విశ్వవ్యాప్తంగా  తెలివి తేటలకు గుర్తుగా పరిగణిస్తారంట. గ్రీకు భాషలో  గుడ్లగూబను ఎథీనా అంటే   జ్ఞానదేవతగా పిలుస్తారంట. ఒడిశాలోని పూరిలో గుడ్లగూబలను  వృత్తాకార కళ్లతో ఉన్న ప్రభువు  లేదా చోకా-ధోలా రూపంలో దేవుడిలా  పిలుస్తారంట.

కళ్లకు ఆకర్షించే శక్తి...
గుడ్లగూబల కళ్లకు హిప్నోటైజ్  చేసే శక్తి ఉంటుందని నమ్ముతుంటారు. అందుకే  దీపావళి సందర్భంగా గుడ్లగూబలను  తాంత్రిక పూజల సమయంలో వాడుతుంటారు.   గుడ్లగూబలు వశికరణ్ (ఆకర్షణ) మారన్ (విధ్వంసం)తో వంటి పలు తాంత్రిక పూజలకు వాడుతుంటారని చెబుతారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies