లగచర్ల ఘటన 52 మంది అరెస్ట్ 16 మందిని రిమాండ్కు తరలించే అవకాశం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై, రెవెన్యూ అధికారులపై దాడి చేసిన నిందితులను రిమాండ్కు తరలించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. పటిష్ట బందోబస్తు మధ్య వైద్య పరీక్షల నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొడంగల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు పోలీసులు బయలుదేరారు. 52 మందిని అరెస్ట్ చేయగా, విచారణ అనంతరం 16 మందిని మాత్రమే రిమాండ్కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
అసలేం జరిగిందంటే...
వికారాబాద్ జిల్లా దుద్యాల, లగచర్ల, పోలేపల్లిలోని 1,350 ఎకరాల్లో ఇండస్ట్రియల్కారిడార్ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. మొదట ఫార్మా విలేజ్ఏర్పాటు చేద్దామని అనుకున్నా స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇండస్ట్రియల్కారిడార్ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే సోమవారం దుద్యాలలో అధికారులు గ్రామసభ, ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం ఉదయం కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్కలెక్టర్ఉమాశంకర్ప్రసాద్, కడా స్పెషల్ఆఫీసర్ వెంకట్‌రెడ్డితో పాటు ఇతర అధికారులు వచ్చారు. అయితే, గ్రామసభకు ఒక్క రైతు కూడా హాజరు కాలేదు. గంట సేపటివరకూ వారి కోసం వేచిచూసినా రాలేదు.
అప్పుడే కలెక్టర్ ప్రతీక్ జైన్ దగ్గరకు బీఆర్ఎస్ లీడర్ మొగవోని సురేశ్వచ్చారు. ‘సార్ రైతులందరూ లగచర్లలో ఉన్నారు. అక్కడే టెంట్ వేశాం. మీరు అక్కడికి వస్తే మాట్లాడొచ్చు’ అని నమ్మించాడు. దీంతో కలెక్టర్, అడిషనల్కలెక్టర్, సబ్‌కలెక్టర్, కడా స్పెషల్ ఆఫీసర్వారి వారి కార్లలో 5 కిలోమీటర్ల దూరంలోని లగచర్లకు వెళ్లారు. గ్రామంలోని రామాలయం దగ్గరకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులు కారు దిగి, రైతులతో మాట్లాడడం మొదలెట్టారు. వెంటనే ఓ పక్క నుంచి 20 నుంచి 30 మంది వరకు కలెక్టర్‌పైకి తోసుకుంటూ వచ్చారు. దాడికి దిగుతున్నారని గుర్తించిన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్ కలెక్టర్‌ను కారు దగ్గరకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఇతర అధికారులపై దాడి చేయబోతున్నారని గమనించిన కలెక్టర్.. వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు.
అప్పటికే రైతులు, గ్రామస్తులు రాళ్లు, కర్రలతో దాడి చేయడం మొదలుపెట్టారు. వెంటనే కలెక్టర్‌ను ఆయన సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్ కారు ఎక్కించి ముందుకు తీసుకువెళ్లబోయారు. ఈ దశలో ఆయన వాహనంపై దాడి చేశారు. వెనుక అద్దాలపై రాళ్లు వేయడంతో, అవి పగిలిపోయాయి. అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, స్పెషల్ఆఫీసర్ వెంకట్‌రెడ్డి దొరకడంతో వారిని ఇష్టమున్నట్టు కొట్టారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో వారు గాయపడ్డారు. దాడి చేస్తున్న వారి నుంచి తప్పించుకోవడానికి సమీపంలోని వరి చేన్లలోకి పరుగులు తీశారు. అయినా వదలకుండా వెంటపడ్డారు. అప్పుడే దుద్యాల నుంచి మిగతా పోలీసులు రావడంతో ప్రాణాలతో బయటపడగలిగారు.