Type Here to Get Search Results !

Sports Ad

నవంబర్ 6 నుంచి ఒంటి పూట బడులు One Day Classes From November 6

నవంబర్ 6 నుంచి ఒంటి పూట బడులు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు గుడ్ న్యూస్. 2024, నవంబర్ 6వ తేదీ నుంచి మూడు వారాల పాటు ప్రభుత్వ పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఎండాకాలం కాదు కదా ఇప్పుడు హాఫ్ డే ఏంటీ అని డౌట్ రావొచ్చు దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ కారణంగానే నవంబర్ 6వ తేదీ నుంచి మూడు వారాలు మధ్యాహ్నం వరకే స్కూల్స్ నిర్వహించనున్నారు.

 రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన ఇంటింటి సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న  సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో 80 వేల మంది సేవలను వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్లు ఉండబోతున్నారు.

 సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లలో దాదాపు సగం, అంటే 40వేల మంది టీచర్లే. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 6 నుంచి మూడు వారాల పాటు కుల గణన సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో విద్యా శాఖ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లతో పాటు ఎంఆర్​సీ సిబ్బంది, ఎయిడెడ్ నాన్ టీచింగ్ సిబ్బంది సేవలను వినిగియోచుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

 మొత్తం 80వేల మందిలో మెజార్టీగా టీచర్ల సేవలను వినియోగించుకుంటామని, వారితోపాటు తహసీల్దార్, ఎండీఓ, ఎంపీఓ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్ల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. స్కూళ్లలో బోధనకు ఇబ్బంది కలగకుండా ముసాయిదా రూపొందించామని పేర్కొన్నారు. ఇంటింటి సర్వే నిర్వహణ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముందుగానే టీచర్ల సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వేకు సంపూర్ణ మద్దతిస్తామని, తాము పాల్గొంటామని టీచర్ల సంఘాలు ప్రకటించాయి. అందుకు తగ్గట్టుగా టీచర్ల సేవలను వినియోగించుకునేలా ప్లాన్ రూపొందించారు. 

మధ్యాహ్నం వరకే స్కూళ్లు...
ఇంటింటి సర్వేలో ప్రైమరీ స్కూళ్ల టీచర్లు పాల్గొననుం డడంతో అందుకు తగ్గట్టుగా స్కూల్ టైమింగ్స్​ను మార్చారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే స్కూళ్లు కొనసాగనున్నాయి. పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపించనున్నారు. ఆ తర్వాత ఎంపిక చేయబడిన టీచర్లు సర్వేకు వెళ్తారు. అయితే, యూపీఎస్, హైస్కూళ్లలో పనిచేస్తున్న ఎస్జీటీలను ఈ సర్వే నుంచి మినహాయించారు. 

సర్వేలో 36,559 మంది ఎస్జీటీలు...
ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో మొత్తం 36,559 మంది ఎస్జీటీలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు పాల్గొననున్నారు. దీంతో పాటు 6,256 మంది ఎంఆర్​సీ సిబ్బంది, 2 వేల మంది సర్కా రు, జెడ్పీ/ఎంపీపీ స్కూళ్సలోని సిబ్బంది, ఎయిడెడ్ స్కూళ్లలోని మినిస్టీరియల్ సిబ్బందిని వినియోగించుకుంటామని అధికారులు ప్రకటించారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies