రిటన్ టెస్ట్ లేకుండా డిగ్రీతో ఉద్యోగం నెలకు 65 వేలు జీతం EPFO జాబ్ నోటిఫికేషన్
జాతీయ National News భారత్ ప్రతినిధి : డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు గొప్ప అవకాశం.. డిగ్రీ విద్యార్హతతో ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో పని చేయడానికి కాంట్రాక్ట్ బేసింక్ ఉద్యోగులు కావాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల్లో ఒక సంవత్సరం వరకు పని చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికల భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 29న EPFO నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ కాలం ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాలకు పొడిగించవచ్చు. అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలలోపు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణుడై ఉండాలి. నెలకు రూ.65 వేల జీతం ఉంటుంది.
ఇంటర్య్వూ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు పరీక్ష లేదు. అభ్యర్థులు ఒరిజనల్ స్టడీ సర్టిఫికేట్స్ చూపించాలి. అలాగే ఓ సెట్ జిరాక్స్ కాపీ సెల్ఫ్ అటెట్స్ చేసి ఇవ్వాలి. epfindia.gov.in అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు పత్రాన్ని, అభ్యర్థుల డాక్యుమెంట్స్ ను rpfc.exam@epfindia.gov.in కి మెయిల్ చేయాల్సి ఉంటుంది.