జాబ్ ఇస్తే జీతం తీసుకోకుండా పని చేస్తా ఎందుకంటే
జాతీయ National News భారత్ ప్రతినిధి : అవును మీరు చదివింది నిజమే. ఉద్యోగం ఇస్తే, సాలరీ తీసుకోకుండా పని చేస్తా అని ఓ స్టూడెంట్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైయిర్ ఎడ్యుకేషన్ కోసం యూకె వెళ్లిన శ్వేతా కోతండన్ యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ లో MSc మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది. యువతి 2021లో బ్రిటన్ వెళ్లింది. 2022లో ఆమె గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మరో మూడు నెలల్లో శ్వేత స్టూడెంట్ వీసా టైం అయిపోతుంది. శ్వేతా కోతండన్ వీసా స్పాన్సర్ చేసే కంపెనీలో డిజైన్ ఇంజనీర్ జాబ్ కోసం వెతుకుతుంది.
ఇప్పటి వరకు ఆమెకు 300 జాబ్స్ కు అప్లై చేసుకున్నప్పటికీ అందులో ఒక్క కంపెనీ కూడా వీసా ఇవ్వడానికి ముందుకు రాలేదంట. దీంతో శ్వేతా కోతండన్ లింక్డ్‌ఇన్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమెకు వీసా ఇచ్చే కంపెనీలో ఫ్రీగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఓ ట్విట్ చేసింది. అది చదివిన వారిలో ఎవరైనా ఇంటర్నేషన్ స్టూడెంట్స్ ఉండే దాన్ని షేర్ చేయమని క్యాప్షన్ లో రాసింది. దీంతో ఆ పోస్ట్ ఎక్స్ లో తెగ వైరల్ అయ్యింది.
ఇండియన్ స్టూడెంట్ బ్రిటన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె అక్కడ ఎంప్లాయ్ వీసా తీసుకొని అక్కడే స్థిరపడాలని అనుకుంటోంది. అయితే ఆ యుతికి జాబ్ మాత్రం దొరకడం లేదు. ఆమెకు వీసాతోపాటు జాబ్ ఇస్తే నెల రోజులపాటు సాలరీ లేకుండా పని చేస్తానని అంటోంది. అలాగే వారంలో 7 రోజులు, రోజుకు 12 గంటలు పని చేయడానికి శ్వేత రెడీగా ఉందని చెప్పుకొచ్చింది. శ్వేత పోస్ట్ కు నెటిజన్ల నుంచి భారీగా రియాక్షన్ వచ్చింది. వారికి తొచిన సలహాలు ఇచ్చారు కొందరు. మరికొందరు ఇంటర్నెట్ యూజర్లు ఆ పోస్ట్ షేర్ చేశారు.
లాంగ్ టైం ఫ్యూచర్ కోసం ఆమె యూకేలోనే ఉండాలని అనుకుంటుంది. విదేశాల్లో చదివితే మంచి ఉద్యోగం, గొప్ప ఫ్యూచర్ ఉంటుందని ఆశపడే స్టూడెంట్స్ ను ఈ పోస్ట్ నిరాశపరుస్తోంది. చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. హైయిర్ ఎడ్యుకేషన్ కోసం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే సెట్టిల్ అవ్వాలని కలలు కంటున్నారు. కానీ టెక్నాలజీలో ఏఐ రాక, అంతకు ముందు కోవిడ్ కారణంగా ఫారిన్ కంట్రీస్ లో జాబ్ మార్కెటింగ్ పడిపోయింది.