Type Here to Get Search Results !

Sports Ad

సీతాఫలం కేన్సర్ రానీయదు ఈ పండును వీళ్లు తినకూడదు Custard Apple Does Not Cause Cancer, They Should Not Eat This Fruit

సీతాఫలం కేన్సర్ రానీయదు ఈ పండును వీళ్లు తినకూడదు

Health News భారత్ ప్రతినిధి : సీతాఫలం సీజన్ మొదలైంది. ఇప్పటికే మార్కెట్లో సీతాఫలాలు అందుబాటులోకి వచ్చేశాయి మనిషి శరీరానికి అవసరమైన కీలక పోషకాలన్నీ ఈ పండులో ఉంటాయి. మరి అవేంటో తెలుసుకోండి. రోజుకొ యాపిల్​ పండు తింటే డాక్టర్​ కు వ్యాధులకు దూరంగా ఉండిచ్చనే నానుడి  అందరికి తెలిసిందే.   అలాగే సీతాఫలం కూడా రోజుకొకటి చొప్పున తింటే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. కానీ అన్ని రోజులూ ఈ పండు దొరకదు.

 కేవలం శీతాకాలంలో మాత్రమే సీతాఫలం దొరుకుతుంది. మిగిలిన పండ్లతో పోలిస్తే సీతాఫలంలో క్యాలరీలు ఎక్కువ.   సీతాఫలంలో ఉండే మెగ్నిషియం గుండెనొప్పి, పక్షవాతం, ఒత్తిడిలాంటివి. దరిచేరనివ్వదు.  కీళ్లనొప్పుల సమస్యలు కూడా తగ్గుతాయి కడుపులో నోటిలో అల్పర్లను కూడా తగ్గించొచ్చు.

పోషకాల నిలయం...
సీతాఫలంలో పోషకాలు పుష్కలం. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి యాంటీ అక్సిడెంట్లు  సీతాఫలంలో ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు. సీతాఫలంలో ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. జీర్ణ ప్రక్రియను మెరుగుపర్చే పీచు, విటమిన్-బి6, పొటాషియం కూడా  సీతాఫలంలో ఎక్కువ. సీతాఫలంలో విటమిన్- ఎ అధిక మోతాదులో ఉండడం వల్ల దృష్టి లోపాలు దరిచేరవు. బరువు పెరగాలనుకునే వాళ్లకి సీతాఫలం  బెస్ట్​ ఆప్షన్​.  అంతేకాదు  సీతాఫలంలో ఉండే ఫినాలిక్ పదార్థాలు: యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

 సీతాఫలాలతో పాటు చెట్టు ఆకులు, బెరడు వివిధ రకాల జబ్బుల ట్రీట్ మెంట్ లో ఉపయోగపడతాయి. ఈ చెట్టు ఆకుతో డికాక్షను చేసుకొని తాగితే జీర్ణాశయంలో సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఆకుల నుంచి తీసిన కషాయాన్ని ప్రతిరోజూ తీసుకుంటే డయేరియా జలుబు, మధుమేహం తగ్గుతాయి.  

ఇంకొన్ని లాభాలు...
* తిన్న వెంటనే శక్తినిచ్చే సీతాఫలం కండరాలకు ఐరాన్నిస్తుంది..
* కేన్సర్ కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. లివర్ కేన్సర్. మెదడులో ట్యూమర్స్, బ్రెస్ట్ కేవ్సర్ రాకుండా చేసే గుణం 

* సీతాఫలానికుంది. ఈ పండ్లలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఒత్తిడి డిప్రెషన్ రాకుండా చేయటంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

* సీతాఫలం పంటి నొప్పిని నివారిస్తుంది.
* గర్భిణీలు సీతాఫలం తింటే వాంతులు, వికారం తగ్గుతాయి
* ఐరన్ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి రాదు.
* గుండెకు మంచిది, డయాబెటిస్ దరి చేరనివ్వదు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మం  వెంట్రుకల ఆరోగ్యానికి సీతాఫలాలు చక్కగా ఉపయోగపడతాయి. చర్మసమస్యల్ని నివారించే లక్షణం కూడా వీటికి ఉంది.

వీళ్లు తినకూడదు...
అస్తమా, మధుమేహం ఉప్పవాళ్లు సీతాఫలం తినకూడదు. బాగా పండిన పండును తింటే అందులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండడం. వలన షుగర్ పేషెంట్లకు హాని కలుగుతుంది. మూత్రపిండాలు, కాలేయ వ్యాధితో బాధపడేవాళ్లు కూడా సీతాఫలానికి దూరంగా ఉండాలి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies