Type Here to Get Search Results !

Sports Ad

ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌ ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన తేదీలు ప్రకటన Dates For Payment Of Alert Exam Fee For Inter Students Are Announced

ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌ ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన తేదీలు

 ప్రకటన

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి :  తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఎగ్జామ్ ఫీజు చెల్లింపులకు ఇంటర్‌ బోర్డు తేదీలను ఖరారు చేసింది. ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవ‌త్సరం పబ్లిక్ పరీక్షలు మార్చి- 2025కు సంబంధించిన‌ పరీక్ష ఫీజు షెడ్యూల్, ఫీజు వివరాలను బోర్డు విడుదల చేసింది.

* విద్యార్థులు ఎటువంటి అప‌రాధ‌ రుసుము లేకుండా నవంబర్ 06 నుంచి నవంబర్ 26 తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
* రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 04 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. 
* రూ. 500 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 05 నుంచి డిసెంబర్ 11 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
* రూ. 1,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 18 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. 
* రూ.2,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 27 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. 

ఫీజు చెల్లింపుల వివరాలు...
* ఫస్టియర్‌- జనరల్ రెగ్యులర్: రూ. 520
* ఫస్టియర్‌- ఒకేషనల్ రెగ్యులర్: రూ. 750
* సెకండియర్‌-  జనరల్ కోర్సెస్ (జనరల్ ఆర్ట్స్: రూ. 520, జనరల్ సైన్స్: రూ. 750)
* సెకండియర్‌- ఒకేషనల్ రెగ్యులర్: రూ. 750

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies