దీపావళి ఎఫెక్ట్ మృణాల్ ఠాకూర్ ఫొటో ఎడిట్ కరెక్ట్ కాదంటూ నెటిజన్కు ఇచ్చిపడేసింది
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : సీతారామం (SitaRamam) సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్డం ను సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఈ సినిమా అందించిన విజయంతో టాలీవుడ్లో వరుస ఆఫర్స్ అందుకుంది ఈ బ్యూటీ. నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న చేసి సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఇటీవలే విజయ్ దేవరకొండతో ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది.
ఇదిలా ఉంటే గతేడాది 'ది ఫ్యామిలీ స్టార్’ మూవీ నుండి దీపావళి స్పెషల్గా విజయ్ దేవరకొండ-మృణాల్ కి సంబంధించిన పోస్టర్ చూసే ఉంటారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆ ఫోటోను ఎడిట్ చేస్తూ 'విజయ్ దేవరకొండను తీసేసి మృణాల్ పక్కన తాను ఉండేలా ఫోటో క్రియేట్ చేశాడు. ఇందులో మృణాల్తో కలిసి అతను టపాసులు కాలుస్తున్నట్లు ఉంది. దీనికి "దీపావళి ఫొటో ఎడిటింగ్.. బాలీవుడ్ నటి ఫొటోషూట్’" అని తన స్టైల్లో క్యాప్షన్ ఇచ్చాడు.
ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మృణాల్ వరకు చేరింది. దాంతో ఆ నెటిజన్ పై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తనకు ఏమాత్రం నచ్చలేదని ఇలా చేయడం భావ్యం కాదని నెటిజన్పై ఫైర్ అయింది. ‘‘బ్రదర్ మీకు మీరే ఎందుకు తప్పుడు భరోసా ఇచ్చుకుంటున్నారు మీరు చేసిన పని బాగుందనుకుంటున్నారా ఇది ఏమాత్రం బాలేదు’’ అని మృణాల్ తెలిపారు.
ఇక వెంటనే ఆ నెటిజన్ మృణాల్ ఫోటోని డిలేట్ చేయడంతో 'ఇంకా మంచిగా ట్రై చేస్తే ఫ్యూచర్లో సినిమాలో ట్రై చేయొచ్చు' అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా చెప్పుకొచ్చింది. అలాగే ఈ నెటిజన్ చేసిన పనికి పలువురు నెటిజన్లతో పటు మృణాల్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అతడి తీరుని తప్పుబడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా అభివృద్ధి అవుతున్న ఈ టెక్నాలజీకి చాలా మంది హీరోయిన్స్ డిజిటల్ వేధింపులకు గురవుతున్నారు. వీటికి వ్యతిరేకంగా మృణాల్ ఠాకూర్ వైఖరి ఇది ఫస్ట్ టైం ఏంకాదు. హీరోయిన్స్ పై చేఇస్నా డీప్‌ఫేక్ కంటెంట్‌ను ఆమె గతంలో ఖండించింది. ముఖ్యంగా రష్మిక మందన్న యొక్క కల్పిత వీడియో ఆన్‌లైన్‌లో ప్రసారం అయిన తర్వాత. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, హీరోయిన్స్ ను లక్ష్యంగా చేసుకుని అనుచితమైన, డిజిటల్ మార్ఫింగ్ చేసిన వీడియోలపై తన నిరాశను వ్యక్తం చేసింది.