బాత్రూంలో ఇలా చేస్తున్నారా పైల్స్ మొలలు రావొచ్చు
Health News ఆరోగ్య వార్తలు : మీరు బాత్ రూంలో ఎక్కువ సమయం గడుపుతున్నారా తరుచుగా సెల్ ఫోన్లు, ట్యాప్ టాప్ లు, ట్యాబ్ లతో కాలక్షేపం చేస్తున్నారా బాత్ రూంలో అధిక సమయం గడిపితే ఏమవుతుందో ఎప్పుడైన ఆలోచించారా ఇటీవల అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.
కొంతమంది సాధారణంగా వాష్ రూం కు వెళ్లినప్పుడు సెల్ ఫోన్లు, ట్యాబ్ లు, ల్యాబ్ టాప్ లు ఉపయోగిస్తుంటారు. బాత్ రూంలో ఎక్కువ సమయం గడపడం వల్ల పెద్దగా నష్టమేముంటుంది అని చాలా మంది కొట్టిపారేస్తుంటారు. టాయిలెట్ లో ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెమరాయిడ్స్, పెల్విక్ కండరాలు బలహీన పడే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. పెల్విక్ కండరాలు బలహీనపడటానికి ఎక్కువ సమయం బాత్ రూంలో కూర్చోవడం కూడా ఓ కారణమని డల్లాస్ లోని టెక్సాస్ యూనివర్సిటీ సౌత్ వెస్ట్రన్ మెడికల్ కొలొరెక్టల్ సర్జన్లు చెబుతున్నారు.