గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు ఒకే రోజు ఇంత తగ్గడం ఇదే మొదటిసారి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో భారత్ లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గురువారం ( నవంబర్7) 10 గ్రాముల బంగారం ధర రూ. 76వేల 920 కి పడి పోయింది. బుధవారం బంగారం ధర రూ. 79వేల 930 ఉండగా రూ.2వేలు తగ్గింది.
భారత్ తోపాటు అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గాయి. అక్టోబర్ నెలలో దేశీయంగా రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు. బులియన్ అసోసియేషన్ ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.10 గంటల సమయానికి రూ. 76వేల 920 గా ఉన్నాయి. బుధవారం తో పోలిస్తే బంగారం ధర రూ. 2010 లు తగ్గింది. మరోవైపు కిలో వెండి ధర రూ. 91వేల 140గా ఉంది.