Type Here to Get Search Results !

Sports Ad

పుష్ప గాడి ప్రభంజనానికి రంగం సిద్ధం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడంటే The Grand Pre Release Event Is All Set For Pushpa Gadi Prabhanjana

పుష్ప గాడి ప్రభంజనానికి రంగం సిద్ధం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడంటే

Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : పుష్ప రాజ్ మాస్ జాతరకు రంగం సిద్ధమైంది. ఇటీవలే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో బీహార్ మొత్తం అభిమానుల ఈలలతో మోగిపోయింది. అక్కడికి వచ్చిన లక్షలమంది ఆడియన్స్ అరుపులతో ఇండియా షేక్ అయ్యే ప్రభంజనం పుట్టించింది.

 ఈ నేపథ్యంలో పుష్ప 2 మేకర్స్ మరో గ్రాండ్ ఈవెంట్కి సిద్ధం చేశారు. "మక్కలే, సింగర చెన్నై లా ఓరు స్పెషల్ ఈవెనింగ్ కు సిద్ధంగా ఉన్నారా? నవంబర్ 24న సాయంత్రం 5 గంటల నుండి పుష్ప వైల్డ్‌ఫైర్ ఈవెంట్.. లియో ముత్తు ఇండోర్ స్టేడియం, సాయి రామ్ ఇంజినీరింగ్ కళాశాలలో" జరగనుంది అని ట్విట్టర్ X లో వివరాలు వెల్లడించారు. బీహార్ లో భీభత్సం సృష్టించిన అల్లు అర్జున్.. ఇక చెన్నైలో విధ్వంసం పుట్టిస్తాడో చూడాలి.

 పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండటంతో ఇండియా వైడ్ గ్రాండ్గా ప్రమోషన్స్ చేయనున్నారు. త్వరలో 'తెలుగు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి' రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లేదా ఎల్బీ స్టేడియంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మేకర్స్ పనులు స్టార్ట్ చేశారట. రానున్న ఈ రెండ్రోజుల్లో 'రామోజీ ఫిలిం సిటీ లేదా ఎల్బీ స్టేడియం' లో ఏదో ఒకటి కన్ఫమ్ చేయనున్నారట. ఇక పుష్పాగాడి మాస్ జాతర మోతమోగిపోవాల్సిందే.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies