హ్యాపీ బర్త్ డే సీఎం రేవంత్ ముఖ్యమంత్రికి ప్రధాని మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు (నవంబర్ 8) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మోడీ బర్త్ డే విషెస్ తెలిపారు. మరోవైపు. సీఎం హోదాలో ఫస్ట్ బర్త్ డే జరుపుకుంటున్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.