Type Here to Get Search Results !

Sports Ad

లగచర్ల గ్రామంలో ప్రజలను వేధిస్తున్న ప్రభుత్వం.... తీరుపై మహిళా సంఘాల నేతల ఆగ్రహం In Vikarabad Dist

 

లగచర్ల గ్రామంలో ప్రజలను వేధిస్తున్న ప్రభుత్వం.... తీరుపై మహిళా సంఘాల నేతల ఆగ్రహం

వికారాబాద్ Vikarabad భారత్ న్యూస్ ప్రతినిధి : ఇటీవల లగచర్ల గ్రామంలో ఫార్మాసీ నిర్మాణం పై గ్రామస్థులు అధికారుల పై జరిగిన సంఘటన పై మరియు బాధితుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా సంఘాల జేఏసీ నేతలు సంధ్య, పద్మజా షా, ఝాన్సీ, అనసూయ, సజయ,  సిస్టర్ లిస్సి, గీత సహా మహిళా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు.మహిళా సంఘాల నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారని అడగడం జరిగింది.

జిల్లా ఎస్సీ, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తో మాట్లాడినప్పటికీ లగచర్ల వెళ్లేందుకు అనుమతించని పోలీసులు.లగచర్ల లో జరిగిన సంఘటనకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్తుంటే మహిళా సంఘాల నేతలపై పోలీసుల దౌర్జన్యం చేయడం.

లగచర్లలో జరిగిన సంఘటనలను ప్రపంచానికి తెలియజేయాలంటూ బాధితుల నుంచి ఫోన్లు వచ్చాయన్న మహిళా సంఘాల నేతలు మాతో పాటు పోలీసులను కూడా రావాలని కోరితే రాకపోగా మమ్మల్ని అనుమతించటం లేదంటూ ఆగ్రహం.మీడియా కూడా లేకుండా వెళ్తామన్న అంగీకరించని పోలీసులు.పెనులాగటలో మహిళా నేతల దుస్తులు చించిన పోలీసులు. ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా సంఘాల జేఏసీ నేతలు. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేందుకు వెళ్తున్న మమ్మల్ని ఆపాల్సిన అవసరమేముందంటూ పోలీసులు నిలదీసిన మహిళా సంఘాల సభ్యులు. 

లగచర్లలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెెళ్తుంటే ఆపాల్సిన అవసరమేముందంటూ మండిపాటు.పోలీసులు కూడా తమతో రావచ్చని చెప్పినప్పటికీ మహిళా సంఘాల నేతలను అనుమంతిచకుండా దౌర్జన్యం. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మహిళా సంఘాల నేతల ఆగ్రహం. నిజంగా పోలీసులు మహిళలపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులకు పాల్పడకపోతే మమ్మల్ని ఎందుకు అనుమతించటం లేదంటూ నిలదీత. పోలీసులు తమను లైంగికంగా వేధించారంటూ, అసభ్యంగా తిట్టారంటూ లగచర్లలో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అండగా ఉండాలంటూ ఫోన్లు చేసి కోరుతున్నారు. ఈ పోలీసులు, ప్రభుత్వం తీరు చూస్తుంటే అనుమానాస్పదంగా ఉంది. 

బాధితులకు వద్దకు మమ్మల్ని వెళ్లనిస్తే నిజాలు ప్రపంచానికి తెలుస్తాయని భయమా అంటూ పోలీసులను ప్రశ్నించిన నేతలు.లగచర్ల లో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు, దౌర్జన్యాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని పిలుపు.ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై.మహేందర్, బి.మల్లేశ్వరం అరెస్టు చేయడం జరిగింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies