Type Here to Get Search Results !

Sports Ad

బాస్ లీవ్ ఇవ్వలేదని వీడియో కాల్‌లో పెళ్లి ఎక్కడో తెలిస్తే షాక్ It Will Be A Shock If The Wedding Comes To Know Somewhere In The Video Call That The Boss Has Not Given Leave

బాస్ లీవ్ ఇవ్వలేదని వీడియో కాల్‌లో పెళ్లి ఎక్కడో తెలిస్తే షాక్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఈ రోజుల్లో టెక్నాలజీతో కాందంటూ ఏదీ లేదని నిరూపించబడింది. హిమాచల్ ప్రదేశ్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. సిమ్లాకు చెందిన వ్యక్తి ఉద్యోగరీత్య టర్కీలో పని చేస్తున్నాడు. ఓ అమ్మాయితో అతనికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి చేసుకోవడానికి సెలవు కోసం అతని బాస్ కు లీవ్ అప్లై చేసుకున్నాడు. కంపెనీ లీవ్ ఇవ్వడం కుదరదని చెప్పడంతో అతను వీడియో కాల్లో నికా చేసుకున్నాడు.

 హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట ఆన్‌లైన్ వీడియో కాల్ సాక్షిగా ఒక్కటైయ్యారు. పెళ్లి కూతురు మండిలో.. పెళ్లి కొడుకు టర్కీలో ఉండి వీడియో కాల్ లో పెళ్లి తంతు పూర్తి చేశారు. బిలాస్‌పూర్ చెందిన అద్నాన్ ముహమ్మద్ టర్కీలో వర్క్ చేస్తున్నాడు. ఇండియాకి వచ్చి వివాహ చేసుకునేందుకు ముహమ్మద్ లీవ్ కోరగా.. కంపెనీ సెలవు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతను వర్చువల్‌గా ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్ లో పెళ్లి చేసుకున్నాడు. అతను అంత త్వరగా పెళ్లి చేసుకో అనారోగ్యంతో ఉన్న పెళ్లి కూతురు తాత మంచాన పడ్డడాడు. ఆమె పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో త్వరగా ఈ పెళ్లి చేశారు. ఇరు కుటుంబీకులు ఆన్ లైన్ నికాకు అంగీకరించారు. బిలాస్‌పూర్ నుంచి నవంబర్ 3న ఆదివారం మండికి చేరుకున్నారు. మండీలో నవంబర్ 4న (సోమవారం) వీడియో కాలంలో వారి వివాహం జరిగింది.

 ఖాజీ వారితో కలిసి ఖుబూల్ హై అని మూడుసార్లు అనిపించారు. 2023 జూలైలో సిమ్లాలోని కోట్‌ఘర్‌కు చెందిన మరో వ్యక్తి కూడా ఇలానే ఆన్ లైన్ లో పెళ్లి చేసుకున్నాడు. ఆశిష్ సింఘా, శివాని ఠాకూర్ లు కులులోని భుంతర్‌కు చెందిన కొండచరియలు విరిగిపడటంతో టైంకు వారి పెళ్లింటికి చేరుకోలేక పోయారు. దీంతో వీడియో-కాన్ఫరెన్స్ లో పెళ్లి చేశారు. వీరి పెళ్లి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies