ఢిల్లీలో లాక్ డౌన్ సిచ్యూవేషన్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
జాతీయ National News భారత్ ప్రతినిధి : దేశ రాజధాని ఢిల్లీ గత వారం రోజులు గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీ , దాని సరిహద్దు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయిలో నమోదు అవుతోంది. బుధవారం( నవంబర్ 20) ఉదయం కూడా వాయు కాలుష్యం సివియర్ కేటగిరిలో రికార్డయింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని చర్యలు చేప్టటింది. బుధవారం నుంచి 50 శాతం మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇండ్లనుంచి పని చేస్తారని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు.
బుధవారం ఢిల్లీ, దాని సరిహద్దు రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ సివియర్ కేటగిరిలో నమోదు అయింది. ఉదయం7 గంటల సమయంలో AQI 463 నమోదు అయింది. ముండ్కలో 464 , వాజీ పూర్, అలిపూర్ లో462 AQI నమోదు అయింది. ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు పేరుకుపోయింది. ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు సమీపంలో పూర్తిగా విజిబిలిటీ తగ్గిపోయింది. రోజంతా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఢిల్లీ వాతావరణ శాఖ హెచ్చరించింది.