త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న మహానటి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తన చిరకాల మిత్రుడు దుబాయ్‌కి చెందిన ఆంటోని తట్టిల్‌తో ఆమె వివాహం జరగబోతోందట. డిసెంబర్ రెండో వారంలో గోవాలో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నట్టు సమాచారం. గత పదిహేనేళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లితో ఒకటవబోతున్నట్టు తెలుస్తోంది.
పెళ్లి విషయంపై అతి త్వరలో కీర్తి సురేష్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఇక ప్రముఖ నటి మేనక, నిర్మాత జి.సురేష్ కుమార్ కూతురైన కీర్తి సురేష్ ‘మహానటి’ చిత్రంతో తెలుగు వారికి దగ్గరైంది. తమిళ, మలయాళ భాషల్లోనూ మెప్పించిన ఆమె ప్రస్తుతం వరుణ్ ధావన్‌కి జంటగా ‘బేబి జాన్’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.