డెస్క్‌టాప్ పాత ల్యాప్‌టాప్‌ల్లో ఫింగర్ ప్రింట్ ఇలా సెట్ చేస్కోండి
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఈ మధ్య లాంచ్ చేస్తున్న అన్ని హై ఎండ్ ల్యాప్‌టాప్‌ల్లో ఫింగర్ ప్రింట్ రీడర్లు ఇన్‌బిల్ట్‌గా వస్తున్నాయి. కానీ డెస్క్‌టాప్, పాత ల్యాప్‌టాప్‌ల్లో ఈ ఫీచర్ లేదు. వాటికి కూడా ఫింగర్‌ప్రింట్ ఫీచర్‌ని యాడ్ చేసుకునేందుకు ఈ గాడ్జెట్‌ని తీసుకొచ్చారు. ‘ఎమిసీ స్మార్ట్’ అనే కంపెనీ దీన్ని మార్కెట్‌లో అమ్ముతోంది. ఇది యూఎస్బీ పెన్‌డ్రైవ్ కంటే చిన్నగా ఉంటుంది. యూఎస్బీ పోర్ట్ ద్వారా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.
ఇది విండోస్ 11,10కి సపోర్ట్ చేస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సింపుల్ సెట్టింగ్స్‌తో దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ లెర్నింగ్ అల్గారిథమ్‌తో పనిచేస్తుంది. ఫింగర్ ప్రింట్‌ని 0.05 సెకన్లలోనే స్కాన్ చేయగలదు. అంతేకాదు 360 డిగ్రీ ఫింగర్ ప్రింట్ రీడింగ్ కెపాసిటీతో వస్తుంది. 10 ఫింగర్ ప్రింట్ ఐడీలను గుర్తుంచుకోగలదు. ధర 2,570 రూపాయలు